మరో గేటు ఎత్తివేత
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:12 PM
తెలుగుగంగ జలాశయం నుంచి అధికారులు శనివారం మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
వెలుగోడు నుంచి దిగువకు నీటి విడుదల
వెలుగోడు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ జలాశయం నుంచి అధికారులు శనివారం మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం నాలుగు స్పిల్‌వే గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని గాలేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి బనకచర్ల సముదాయం నుంచి 12వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరు తోంది. జలాశయం నుంచి మెయిన్ కెనాల్ ద్వారా 5వేలు, స్పిల్‌వే ద్వారా 8వేలు, కుడి తూము ద్వారా 60, ఎడమ తూము ద్వారా 30, నంద్యాల తాగునీటి కోసం 20 క్యూసెక్కుల చొప్పున మొత్తం 13,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 264.70 మీటర్ల వద్ద 15.234 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ అధికారులు తెలిపారు.
Updated Date - Jul 26 , 2025 | 11:12 PM