పెచ్చులూడుతున్న అంగన్‌వాడీ కేంద్రం
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:32 AM
మండలంలో పుల్లగుమ్మి అంగన్వాడీ కేంద్రం-1 భవనం పైకప్పు పెచ్చులూడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెచ్చులూడుతోంది.
పెచ్చులూడిన కేంద్రం పైకప్పు
వెల్దుర్తి, జూలై 14(ఆంధ్రజ్యోతి): మండలంలో పుల్లగుమ్మి అంగన్వాడీ కేంద్రం-1 భవనం పైకప్పు పెచ్చులూడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెచ్చులూడుతోంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో పిల్లలు లేకపోవడంతో ప్రమాదమే తప్పింది. గోడలు పాతబడడి ఇమ్ము వస్తుండటంతో మిగతా రెండు గదుల్లోనే కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడ 25 మంది ప్రీ ప్రైమరీ విద్యార్థులు, 20 మంది గర్భిణులు బాలింతలు, 3సం.లలోపు పిల్లలు 42 మంది ఉన్నారు. ఉన్నతాధికారులు స్పందించి, నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:32 AM