గంజాయిపై ఉక్కుపాదం
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:38 PM
రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయని, ముఖ్యంగా గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కుడా చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు అర్బన్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయని, ముఖ్యంగా గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని కుడా చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పోలీస్‌స్టేషన్ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, రైతులతో కలిసి పరివర్తన పేరిట సమావేశాలు నిర్వహించి గంజాయి నిర్మూలనలో ప్రజల్ని భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయిప్రదేశ్‌గా మారిపోయిందని అన్నారు. విద్యాసంస్ధల్లోనే గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చిన సంగతి ప్రజలకు తెలుసన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 11:38 PM