ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లపై విచారణ చేపట్టాలి

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:33 AM

జిల్లాలో అర్హత లేని వారు ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు పొందుతున్నారని వాటిపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత బాషాకు వినతి పత్రం అందజేశారు.

కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల నాయకుల వినతి

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హత లేని వారు ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు పొందుతున్నారని వాటిపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత బాషాకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌, డీఎస్‌యూ రాష్ట్ర కన్వీనర్‌ శరత, డీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాయుడు, ఆర్‌ ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మహేష్‌లు మాట్లాడారు. ప్రభుత్వం డీఎస్సీ 2025 పరీక్షలను నిర్వహించిందని, అందులో చాలా మంది అభ్యర్థులు అర్హత లేని వారు కూడా ఈడ బ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు పొంది డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా రన్నారు. కానీ ఎటువంటి తనిఖీలు చేయకుండా రెవెన్యూ అధికా రులు కొందరు అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో విజయ్‌, అనిల్‌, గోపాల్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఫ గోకారి కాలనీ, పడిదెంపాడు గ్రామవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి బి.వెంకట స్వామి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్‌ కలెక్టర్‌ను కోరారు.

ఫ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రజాఫిర్యాదుల పరిష్కార వేధిక నిర్వహించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స అండ్‌ మానిటరింగ్‌ కమిటీ మాజీ సభ్యుడు ఎరుకుల రాజు కోరారు. జిల్లాలో భూ సమస్యలతో అనేక మంది షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలతో ఇబ్బంది పడుతున్నార న్నారు.

ఫ దేవనకొండ ఎంఈవోపై విద్యార్థి సంఘం నాయకులు మహేంద్ర, శరత కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవనకొండ మండలంలోని ఎం.కొట్టాల వద్ద ఉన్న ప్రైవేటు పాఠశాల ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేద న్నారు. ఈ పాఠశాలపై ఎంఈవోకు ఫిర్యాదు చేసినా కూడా ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఫ కోడుమూరు పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛభారత కార్మికులకు 3 నెలల పెండింగ్‌ జీతం చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌.మునెప్ప, నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, కోడుమూరు ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాముడు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు నెలల జీతం రాకపోవడంతో స్వచ్ఛభారత కింద పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:33 AM