ఆడిట్ వసూళ్లపై విచారణ జరపాలి
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:37 AM
కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆడిట్ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై విజిలెన్స అధికారులతో కలెక్టర్ విచారణ జరిపించాలని అఽఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాసులు శుక్రవారం డీఆర్వో వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం సమర్పించారు.
డీఆర్వోకు ఏఐవైఎఫ్ నాయకుల వినతి
కర్నూలు హాస్పిటల్, జూన 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆడిట్ పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై విజిలెన్స అధికారులతో కలెక్టర్ విచారణ జరిపించాలని అఽఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాసులు శుక్రవారం డీఆర్వో వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న మాట్లాడుతూ కర్నూలు డీఎంహెచవో కార్యాలయంలో అక్రమ వసూళ్లు, అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆరోపించారు. డీఎంహెచవో ఆఫీసులో జరుగుతున్న అవినీతికి బాధ్యులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jun 14 , 2025 | 01:37 AM