ఉద్యోగులంతా ఏకమై ఆందోళన చేపడుతాం
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:46 PM
వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగులంతా ఏకమై ఆందోళన చేపడుతామని వ్యవసాయ ఉద్యోగుల సర్వీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీవీ సాయికు మార్ హెచ్చరించారు.
కొత్తవారిని నియమించకపోవడం దారుణం
వ్యవసాయ ఉద్యోగుల సర్వీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీవీ సాయికుమార్
కర్నూలు అగ్రికల్చర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగులంతా ఏకమై ఆందోళన చేపడుతామని వ్యవసాయ ఉద్యోగుల సర్వీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీవీ సాయికు మార్ హెచ్చరించారు. ఆదివారం కర్నూలు నగరంలోని వ్యవసాయశాఖ కాన్ఫరెన్స్ హాల్లో సాయికుమార్ అధ్యక్షతన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఉద్యోగులకు సంబంధిం చిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఏవిధమైన ఒత్తిడి పెంచాలనే విషయంపై చర్చించారు. పదవీవిరమణ చేసినవారి స్థానాల్లో కొత్తవారిని నియమిం చకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం దారుణమన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్న జిల్లా వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిప్రకాష్‌కు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గం తరుపున, జిల్లా సంఘం తరుపున సన్మానించారు. వ్యవసాయ శాఖలో పని చేయుచున్న ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇప్పించిన రాష్ట్ర ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవిప్రకాష్, ఎంసీ కాశన్న, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్ రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 11:46 PM