కార్యకర్తలే టీడీపీకి అండ
ABN, Publish Date - May 20 , 2025 | 11:58 PM
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ అని టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు అన్నారు. మంగళవారం పట్టణంలోని జేబీ గార్డెన్స్‌లో నియోజకవర్గ మహానాడు నిర్వహించారు.
టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షినాయుడు
ఆదోని, ఆలూరులో నియోజకవర్గ మహానాడుకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
ఆదోని, మే20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ అని టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు అన్నారు. మంగళవారం పట్టణంలోని జేబీ గార్డెన్స్‌లో నియోజకవర్గ మహానాడు నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడు పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. మీనాక్షినాయుడు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భవించి 42 ఏళ్లు కాగా, 23 ఏళ్లు అధికారంలో ఉన్నామని,ఇందుకు కార్యకర్తల కృషి ఉందని కొనియాడారు. తాను మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఉన్నా, తనకు ఆస్తి కార్యకర్తలే అన్నారు.
తండ్రిలాంటి చంద్రబాబు తమను ఖచ్చితంగా గుర్తిస్తారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు మొదట్లో ఇక్కడకు రాలేదని, అయినా అధినాయకత్వం సూచన మేరకు ఇద్దరినీ గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఆదోని ఎమ్మెల్యేకు కొందరు తప్పుడు సూచనలు ఇచ్చారని, దీన్ని ఎమ్మెల్యే ఇప్పుడు గ్రమించారన్నారు. 1.3కోట్ల సభ్యత్వాలతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను మనం కూడా చేయకూడదని, సంపద సృష్టించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. కార్యకర్తలు, నాయకులకు మధ్య విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఆరాచక పాలనలో అక్రమ కేసులతో కార్యకర్తలందరూ నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. జిల్లా కార్యదర్శి భూపాల్ చౌదరి మాట్లాడుతూ ఆదోనిలో టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, అబ్జర్వర్ సుబ్బారెడ్డి, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి భుపాల్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి మారుతి నాయుడు, కౌన్సిలర్ పార్వతి, మాజీ ఎంపీటీసీ రంగన్న, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్మి సలీం, చాగి మల్లికార్జున రెడ్డి, బసవరాజు, రామస్వామి పాల్గొన్నారు.
టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి: ఎంపీ
ఆలూరు, మే20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్‌హాల్‌లో మినీ మహానాడును టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విడతల వారీగా సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నా, కనీసం ప్రతిపక్ష హోదా లేని వైసీపీ విమర్శలు చేయడం సరికాదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచారని, పాఠశాలలు ఆరంభమయ్యే నాటికి తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తారన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తుందన్నారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎంకు విన్నవిస్తామన్నారు. చంద్రబాబు జన్మదిన వేడుకల్లో గుండెపోటుతో మృతిచెందిన తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర కుంంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఏబీసీ డీసీ అధ్యక్షుడు నగరడోణ కిష్టప్ప, యువనేత గిరిమల్లే్‌షగౌడ్, రఘుప్రసాద్‌రెడ్డి, అట్టేకల్ జగన్‌మోహన్‌బాబు, చింతకుంట రమేష్, మండల కన్వీనర్లు అశోక్, పరమారెడ్డి, తిప్పయ్య, సుధాకర్, కృష్ణంనాయుడు, శివప్రకాష్, రామ్‌నాథ్‌యాదవ్, రవియాదవ్, సుభాష్, కప్పట్రాళ్ల మల్లికార్జున, సతీష్, నరసప్ప పాల్గొన్నారు
Updated Date - May 21 , 2025 | 12:00 AM