అక్రమంగా లేఅవుట్లు వేస్తే చర్యలు
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:40 AM
అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు వేస్తే చర్యలు తప్పవని కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
లేఅవుట్ల రికార్డులను పరిశీలిస్తున్న కుడా చైర్మన సోమిశెట్టి
కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు
పత్తికొండ, జూన 13 (ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు వేస్తే చర్యలు తప్పవని కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శుక్రవారం పత్తికొండ పట్టణంతో పాటు చిన్నహుల్తి, మండగిరి గ్రామాల పరిధిలో వేసిన వెంచర్లను ఆయన పరిశీలించారు. కుడా అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారమే లేఅ వుట్లు వేయాలని, జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్‌లు నిర్మించాలన్నా అనుమతులు తప్పనిసరి అన్నారు. అలా నిబంధనలు పాటించకపోతే కూడా తీసుకునే చర్యలకు బాధ్యులవుతారన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ ఎంపీడీవో నరసింహులు సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jun 14 , 2025 | 01:40 AM