ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిషేధిత ఫుడ్‌ కలర్స్‌ వాడితే చర్యలు

ABN, Publish Date - Jul 08 , 2025 | 01:10 AM

పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని, ఆహారంలో చోటు చేసుకునే కల్తీని గుర్తించాలని, నిషేధించిన ఫుడ్‌ కలర్స్‌ వాడితే చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రత అధికారి రాజగోపాల్‌ హెచ్చరించారు

మాట్లాడుతున్న ఆహార భద్రత అధికారి రాజగోపాల్‌

ఆహార భద్రత అధికారి రాజగోపాల్‌

కర్నూలు రాజ్‌విహార్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని, ఆహారంలో చోటు చేసుకునే కల్తీని గుర్తించాలని, నిషేధించిన ఫుడ్‌ కలర్స్‌ వాడితే చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రత అధికారి రాజగోపాల్‌ హెచ్చరించారు. కేవీజీవీఎం ఆధ్వర్యంలో ఒక్కరోజు ఫోస్టాగ్‌ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం హోటల్స్‌, రెస్టారెంట్లు, ఫుడ్‌ సెంటర్లు, స్వీట్‌ బేకరీలు, బిర్యానీ సెంటర్లు, కూల్‌డ్రింక్స్‌, మిల్క్‌ ఐస్‌క్రీం పార్లర్‌, కిరాణం, చికెన్‌, మటన్‌ దుకణాల యజమానులకు సూరత్‌ గ్రాండ్‌ హోటల్‌లోని సమావేశ భవనంలో ఏర్పాటు చేశారు. ఫుడ్‌ సేఫ్టీ ట్రైనర్‌ యశోద హోటల్స్‌, రెస్టారెంట్లు, బేకరీ, తదితర వాటిల్లో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజ గోపాల్‌ మాట్లాడుతూ ప్రతి వ్యాపారి వ్యకిగత పరిశుభ్రత, ఆహార భద్రత, నాణ్యత, పరిస రాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఆహర సంబంధ వ్యాపారి ఫుడ్‌ సేఫ్టీ ట్రైనింగ్‌ సర్టిఫికేషన్‌ పొంది ఉండాలన్నారు. భవిష్యత్తులో ఫోస్టాక్‌ సర్టిఫికెట్‌ లేని దుకాణాలు, హోటల్స్‌ తదితర ఆహార తినుబండారాలు విక్రయించే వారికి ఫుడ్‌లైసెన్స్‌ ఇవ్వకూడదని 2017 యాక్ట్‌ సెక్షన్‌ 55 చెబుతోందని గుర్తుచేశారు. ఈ కేవీజీవీఎం సౌత్‌ ఇండియా ఫుడ్‌ సేఫ్టీ ట్రైనింగ్‌ ఇన్‌చార్జిలు మోహన్‌బాబు, సింధు, టీం హెడ్‌లు ఎస్‌.జాన్‌ పాల్‌, షారోన్‌, ఎగ్జిక్యూటివ్‌లు భతర్‌, అరుణ్‌ కుమార్‌, మహ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 01:11 AM