ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు

ABN, Publish Date - May 24 , 2025 | 12:29 AM

జిల్లాలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న రాహుల్‌దేవ్‌శర్మ

డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రాహుల్‌దేవ్‌శర్మ

నంద్యాల టౌన్‌, మే 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రోహిబిషన్‌ అధికారి రవికుమార్‌ అధ్యక్షతన జిల్లాలోని ఎస్‌హెచ్‌ వోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సారాను జిల్లానుంచి సమూలంగా నిర్మూలించాలన్నారు. సారా అమ్మే, తయారు చేసేవారిపై దాడులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారి స్థావరాలపై దాడులు చేసి బెల్లం ఊటను ధ్వంసం చేసి బైండోవర్‌ చేశామన్నారు. బార్లు నియమాలను పాటించకపోయినా, సారా అమ్మినా చర్యలు తీసుకోవాలని సీఐలను హెచ్చరించారు. జిల్లాను సారా ర హిత జిల్లాగా చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి స్టేషన్‌ పనితీరు అడిగి తెలుసుకుని సూచనలు ఇచ్చారు. నంద్యాల జిల్లా కేంద్ర కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డీసీ శ్రీదేవి, అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, అసిస్టెంట్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారి మునిస్వామి, ఉమ్మడి జిల్లాల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:29 AM