ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యూరియా కొరత సృష్టిస్తే చర్యలు

ABN, Publish Date - Jul 23 , 2025 | 12:14 AM

యూరియా కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో భరత్‌నాయక్‌ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని యూరియా దుకాణాలను తనిఖీ చేసి, స్టాక్‌ను పరిశీలిం చారు.

పత్తికొండలో గోదాములను పరిశీలిస్తున్న ఆర్డీవో, ఏవోఆదోనిలో దుకాణాలను తనిఖీ చేస్తున్న సబ్‌ కలెక్టర్‌

ఆర్డీవో భరత్‌ నాయక్‌

పత్తికొండ, దేవనకొండలో తనిఖీ,

ఆదోనిలో సబ్‌ కలెక్టర్‌ పరిశీలన

పత్తికొండ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో భరత్‌నాయక్‌ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని యూరియా దుకాణాలను తనిఖీ చేసి, స్టాక్‌ను పరిశీలిం చారు. ఖరీఫ్‌ సాగుకు రైతులు ఎరువులకోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఎరు వులను సిద్ధంగా ఉంచిందన్నారు. కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌లో స్టాక్‌ వివరాలు తప్పగా నమోదుచేస్తూ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వ్యాపారులు బిల్లు ఇవ్వాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని చిన్నహుల్తి, హోసూరు, పుచ్చకాయలమాడ, కోతిరాళ్ల. దూదేకొండ, చందోలి, పత్తికొండ గ్రామాల్లో రైతుసేవా కేంద్రాల ద్వారా యూరియాను అందించారు. నలకదొడ్డి, జూటూరు. చక్కరాళ్ల గ్రామాల రైతుసే వాకేంద్రాలలో రేపటి నుంచి యూరియా అందుబాటులో ఉంటుందని ఎవో వెంకటరాముడు తెలిపారు. రైతులకు సరిపోయే యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. వారితోపాటు డిటీ శ్రీదేవి, వీఆర్వో, వీఆర్‌ఏలు ఉన్నారు.

ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు

దేవనకొండ: ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌ హెచ్చరించారు. దేవనకొండలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్‌ రామాంజినే యులు, ఆర్‌ఐ విజయభాస్కర్‌, ఏఈవోలు రంగన్న, మల్లికార్జున, వీఆర్వో కౌలుట్ల, తదితరులు ఉన్నారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

మద్దికెర: డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ గుండాల్‌ నాయక్‌, ఏవో రవి హెచ్చరించారు. మంగళవారం మద్దికెర, ఎం.అగ్రహారం గ్రామాల్లో దుకాణాలను అకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు అడిగిన ఎరువులనే అమ్మాలని, దుకాణంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎరువులను నిల్వఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఎరువులు మాత్రమే అమ్మాలని, రైతులకు తప్పక రసీదు ఇవ్వాలన్నారు. సిబ్బంది ఆనంద్‌ తదితరులు ఉన్నారు.

ఆదోని అగ్రికల్చర్‌: పట్టణంలోని ఎరువుల దుకాణాలను సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే దుకాణాల లైసెన్స్‌ను రద్దుచేస్తామని ప్రైవేటు డీలర్లను హెచ్చరించారు. యూరియా తీసుకునే రైతులు ఆధార్‌, వేలిముద్రలు వేయాలని, ఈపోస్‌ మిషన్‌లో కొనుగోలు చేయాలని సూచించారు.

Updated Date - Jul 23 , 2025 | 12:14 AM