ఘర్షణలకు పాల్పడితే చర్యలు: ఎస్పీ
ABN, Publish Date - Apr 08 , 2025 | 11:54 PM
ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామాన్ని ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ పికెట్‌ను పరిశీలించారు.
వెల్దుర్తి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. మండలంలోని బొమ్మిరెడ్డిపల్లె గ్రామాన్ని ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ పికెట్‌ను పరిశీలించారు. పోలీసు కవాతు నిర్వహించారు. గ్రామంలోకి వచ్చిన బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి విచారించారు. గ్రామంలో ప్రధాన వీధులు, కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం వెల్దుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి చేరుకొని పోలీసులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ ప్రసాద్‌బాబు, కర్నూలు సీఐ రామానాయుడు, వెల్దుర్తి సీఐ మధుసూదనరావు, వెల్దుర్తి ఎస్‌ఐ అశోక్, క్రిష్ణగిరి ఎస్‌ఐ మల్లిఖార్జున పాల్గొన్నారు.
Updated Date - Apr 08 , 2025 | 11:54 PM