ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:15 AM
ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హేమలత హెచ్చరించారు
ఆదోని రూరల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హేమలత హెచ్చరించారు. ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో బుధవారం నిప్పు పెట్టిన ఈడిగ శంకర్ దుకాణాన్ని డీఎస్పీ గురువారం రూరల్ సీఐ నల్లప్ప, పెద్దతుంబళం ఎస్.ఐ మహేష్ కుమార్‌తో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా గ్రామంలోని కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, అల్లర్లకు పాల్పడేవారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. దుకాణానికి నిప్పు పెట్టిన కేసులో నిందితులు శ్రీరాములు, దాసప్ప, గర్జప్ప, జయరాం, నాగరాజు, మునిస్వామి, దుబ్బన్న, రవిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని ఎస్.ఐ తెలిపారు.
Updated Date - Jul 11 , 2025 | 12:15 AM