ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దూపాడు-బేతంచెర్ల రైల్వేలైన్‌కు భూమి సేకరించండి

ABN, Publish Date - May 30 , 2025 | 11:36 PM

దూపాడు-బేతంచెర్ల రైల్వేలైన్‌కు భూమి సేకరించండి

కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

ఈదుల దేవరబండలో ఉల్లి ప్రాసెసింగ్‌ యూనిట్‌కు 10 ఎకరాలు

రూ.1.61 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం : కలెక్టర్‌

కర్నూలు కలెక్టరేట్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): దూపాడు-బేతంచెర్ల రైల్వే లైన్‌ ఏర్పాట్లకు భూసేకరణ చేయాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఏపీఐఐసీ జడ్‌ఎంను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో డిస్ర్టిక్ట్‌ ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌కు నీటి సరఫరా పైపులైన్‌ నిర్మాణపు పనులు జూలైలోపు పూర్తికావాలని ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహ కాల్లో భాగంగా 24 క్లెయిమ్‌లకు రూ.1.61 కోట్లకు ఆమోదం తెలిపామన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ కింద 17 క్లెయిమ్స్‌కు రూ.1,57,50,166, వడ్డీ రాయితీ కింద ఒక క్లెయిమ్‌కు రూ.13,813, విద్యుత్‌ ఖర్చు రీయింబర్స్‌మెంటు కింద క్లెయిమ్‌కు సంబంధించి రూ.36,663, సేల్స్‌ ట్యాక్స్‌ రీయింబర్స్‌మెంటు కింద 5 క్లెయిమ్స్‌కు సంబంధించి రూ.3,35,265 పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆమోదం తెలిపామన్నారు. కేటగిరీల వారీగా జనరల్‌ కేటగిరీలకు 7, ఎస్సీలకు 15, ఎస్టీలకు 2 మొత్తంగా 24 మందికి ప్రోత్సాహకాలు మంజూరు చేశామన్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇందులో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి 2135 దరఖాస్తులను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి జీఎం అరుణ, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి, ఏపీ ఎంఐపీ పీడీ ఉమాదేవి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ కిషోర్‌ కుమార్‌ రెడద్డి, ఐలా చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంటు విజయకుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:36 PM