ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN, Publish Date - Mar 25 , 2025 | 12:12 AM

ఈ నెల 22న బండిఆత్మకూరు మండలం జీసీపాలెం-నారాయణపురం గ్రామాల మధ్య బొగ్గులకాల్వ అలుగు వంక వద్ద నంద్యాల సుధాకర్‌రెడ్డి హత్య ఘటనలో నిందితులను సోమవారం అరె్‌స్ట చేసినట్లు నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ మంద జావలి ఆల్ఫోన్స్‌ తెలిపారు

వివరాలను వెల్లడిస్తున్న ఏఎస్పీ జావలి

నంద్యాల క్రైం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 22న బండిఆత్మకూరు మండలం జీసీపాలెం-నారాయణపురం గ్రామాల మధ్య బొగ్గులకాల్వ అలుగు వంక వద్ద నంద్యాల సుధాకర్‌రెడ్డి హత్య ఘటనలో నిందితులను సోమవారం అరె్‌స్ట చేసినట్లు నంద్యాల సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ మంద జావలి ఆల్ఫోన్స్‌ తెలిపారు. ఈ మేరకు నంద్యాల తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె నిందితుల వివరాలను వెల్లడించారు. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన గుర్రాల రామస్వామి, గుర్రాల శివన్న అలియాస్‌ శివ అలియాస్‌ యెహోషువ, గుర్రాల తిరుపాలు, గుర్రాల లక్ష్మన్న అలియాస్‌ లక్ష్మణ్‌లను బండిఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామ సమీపంలో గల ఏకశిల అభయాంజనేయస్వామి గుడి దగ్గర అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. నిందితులంతా తండ్రీ కొడుకులని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో సీఐ శ్రీనివాసులురెడ్డి, బండిఆత్మకూరు ఎస్సై జగన్‌మోహన్‌, మహానంది ఎస్సై రామ్మోహన్‌రెడ్డి, సిబ్బందిని అభినందించి రివార్డులకు సిఫార్సు చేసినట్లు ఏఎస్పీ మంద జావలి ఆల్ఫోన్స్‌ తెలిపారు.

Updated Date - Mar 25 , 2025 | 12:12 AM