ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం
ABN, Publish Date - May 24 , 2025 | 11:44 PM
ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, కర్నూలు నగరంలో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
నగరంలో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్
కర్నూలు న్యూసిటీ/ స్పోర్ట్స్, మే 24(ఆంధ్రజ్యోతి): ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, కర్నూలు నగరంలో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం కర్నూలు మండల మునగాల పాడు గ్రామం బాల సాయిబాబ పాఠశాల పక్కన ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానాన్ని మంత్రి టీజీ భరత్‌తో పాటు విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ రంజిత్‌బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా మైదానం విస్తర్ణం, లెవెలింగ్, ఫెన్సింగ్ పనుల పురో గతి గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసు కున్నారు. మంచి అర్కిటెక్‌తో, తగిన సౌకర్యాలతో, మంచి డిజైన్లతో స్టేడియంను అభివృద్ధి చేయ డానికి చర్యలు తీసుకోవాలని ఏసీఏ ప్రతి నిధులకు మంత్రి సూచించారు. అసో సియేషన్ అధ్యక్షుడు, విజయ వాడ ఎంపీ కేశినేని మాట్లాడుతూ గ్రౌండ్ ప్రణాళికను జూన్ 7 నాటికి రూపొందించాల న్నారు. అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభించి, త్వరగా మైదానం నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో స్టేడి యం నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం మంత్రి, కలెక్టర్ సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పరిశీలించారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి శ్రీనివాస్, కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్డీవో సందీప్, తహసీల్దారు రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 11:44 PM