ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సివిల్స్‌లో మెరిసిన కర్నూలు వాసి

ABN, Publish Date - Apr 22 , 2025 | 11:58 PM

సివిల్స్‌లో మెరిసిన కర్నూలు వాసి

పవన్‌కుమార్‌రెడ్డి

పవన్‌కుమార్‌ రెడ్డికి 375వ ర్యాంకు

అమ్మానాన్నలు ఇద్దరూ ఉపాధ్యాయులే

ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ

రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరానికి చెందిన పవన్‌కుమార్‌ రెడ్డి మంగళవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 375వ ర్యాంకు సాధించారు. వైద్యవృత్తిలో స్థిరపడాలని భావించి కర్నూలు మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ కూడా పూర్తి చేశారు. దేశానికి, ప్రజలకు సేవలు అందించాలనే తపనతో ఆయన సివిల్స్‌పై దృష్టి పెట్టారు. అమ్మానాన్నల స్ఫూర్తితో 2020-22 సంవత్సరంలో ఢిల్లీలో సివిల్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. 2023 సివిల్స్‌ ఫలితాల్లో తొలి ప్రయత్నంలోనే పవన్‌కుమార్‌రెడ్డి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. సివిల్స్‌కు ఎంపిక కాలేదని నిరుత్సాహం చెందక రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ ఢిల్లీలో కోచింగ్‌ సెంటరులో సివిల్స్‌లో శిక్షణ తీసుకుంటా వచ్చారు. 2024 సివిల్స్‌ ఫలితాల్లో ఆయన 375వ ర్యాంకును సాధించారు. కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్‌కు చెందిన ఎం.కృష్ణారెడ్డి, మధమతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పవన్‌కుమార్‌ రెడ్డి. తండ్రి కర్నూలు మండలం పంచలింగాలలోని ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ హెచ్‌ఎంగా కృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. తల్లి కల్లూరు మండలంలోని ఆర్‌.కొంతలపాడు ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంటుగా మధుమతి పనిచేస్తున్నారు. పవన్‌కుమార్‌ రెడ్డి ప్రాథమిక విద్య నుంచి హై స్కూల్‌, మెడిసిన్‌ స్థాయి వరకు కర్నూలులోనే విద్య కొనసాగింది. 1నుంచి 5వ తరగతి వరకు వెంకటరమణ కాలనీలోని కేశవరెడ్డి పాఠశాలలోనూ, ఎన్‌ఆర్‌పేట శ్రీలక్ష్మి పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు, భాస్కర్‌నగర్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో 9, 10 తరగతి వరకు విద్యను అభ్యసించారు. అనంతరం గుంటూరులోని భాష్యం జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో బైపీసీ గ్రూపులో చేరారు. ఇంటర్‌ పరీక్షలో 975/1000 మార్కులు సాధించారు. 2016లో జరిగిన ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో పవన్‌ కుమార్‌ రెడ్డి 6వేల ర్యాంకు సాధించికర్నూలు మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌లో చేరారు. 2021-22లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు.సివిల్స్‌లో ర్యాంకు రావడంపైతల్లిదండ్రులు కృష్ణారెడ్డి, మధుమతి ఆనందాన్ని వ్యక్తంచేశారు.

రోజుకు 18 గంటలు కష్టపడ్డా

రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో సివిల్స్‌లో 375వ ర్యాంకు సాధించా. మెడికల్‌ సైన్స్‌ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నా. రోజుకు 18 గంటల పాటు కష్టపడ్డా. ర్యాంకు రావడం ఆనందంగా ఉంది.

-పవన్‌కుమార్‌రెడ్డి

Updated Date - Apr 22 , 2025 | 11:58 PM