ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చేనేతలకు ఊతం..!

ABN, Publish Date - Jul 22 , 2025 | 11:21 PM

వ్యవసాయం తరువాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. పోగుపోగు వడికి పొట్టపోసుకునే చేనేతలకు ఉపాధి పెనుభారమైంది.

జిల్లాలో ఉచిత విద్యుత్తుకు 2,450 కుటుంబాల ఎంపిక

త్రిఫ్ట్‌ నిధి రూ.18 లక్షలు విడుదల

జిల్లాలో 14 చేనేత సహకారం సంఘాలు

మనుగడలో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఒక్కటే

మాస్టర్‌ వీవర్స్‌కు భరోసా ఇవ్వాలని విన్నపం

వ్యవసాయం తరువాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగం. పోగుపోగు వడికి పొట్టపోసుకునే చేనేతలకు ఉపాధి పెనుభారమైంది. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేతన్నలకు భరోసా ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో కార్మికులకు సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా మారింది. ఇలాంటి సమయంలో చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ పథకం అమలుకు సన్నాహాలు చేస్తోంది. త్రిఫ్ట్‌ నిఽధి ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. అయితే కర్నూలు జిల్లాలో సహకార, సహకారేతర రంగాల్లో దాదాపు 15 వేలకు పైగా కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధారపడి జీనవం సాగిస్తుంటే, ఉచిత విద్యుత్‌ పథకం కింద కేవలం 2,450 కుటుంబాలను మాత్రమే గుర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే సర్వే చేపట్టి అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేసే అవకాశం ఉంది.

కర్నూలు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల్లో మగ్గాలపై ఆధారపడి జీనవం సాగించే చేనేత కుటుంబాలు అధికంగా ఉన్నాయి. మెజార్టీగా సహకారేతర రంగంలో ఉన్నారు. మాస్టర్‌ వీవర్స్‌ పర్యవేక్షణలో జరి అంచుపట్టు చీరల తయారీ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సుమారుగా 15 వేలకు పైగా చేనేత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. ఎన్నికల ముందు సొంత మగ్గం ఉండి, వస్త్ర ఉత్తత్తి చేసే కార్మికులకు ఉచితంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో చేనేతలు కూటమి పార్టీలను ఆదరించి ఎమ్మెల్యేలను గెలిపించారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, టీడీపీ గెలుపులో చేనేత పాత్ర ఎంతో ఉంది. అయితే ఏడాది గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి తరుణంలో ఉచిత విద్యుత్‌కు అర్హులైన చేనేత కార్మికులకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. గ్రామ, వార్డు సచివాయాల వెల్ఫేర్‌ అసిస్టెంట్లు సర్వే చేసి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా అర్హుల జాబితాను జిల్లా చేనేత, జౌళి శాఖ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. జిల్లాలో సహకార, సహకారేతర రంగంలో 15 వేలకు పైగా కుటుంబాలు ఉంటే.. కేవలం 2,450 చేనేత కుటుంబాలకే ఉచిత విద్యుత్‌ పథకానికి అర్హులని గుర్తించారు. నిబద్ధతతో కూడిన సర్వే చేయలేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం నేతన్నల ఇంటింటికి వెళ్లి ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీలు గుప్పించి, గెలిచాక వారిని పట్టించుకోవడం లేదంటూ చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

త్రిఫ్ట్‌ నిధికి రూ.18 లక్షలు విడుదల

జిల్లాలో 14 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఒక్కటే కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ సంఘంలో కూడా 500 మంది వరకు సభ్యులు ఉంటే, మగ్గంపై వివిధ వస్త్ర ఉత్పత్తులు చేసేది కేవలం 250 కుటుంబాలేనని చేనేత జౌళి శాఖ అధికారులు తెలిపారు. కోడుమూరులో నాలుగేళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేయించిన నీలకంఠేశ్వర చేనేత సొసైటీ, ఆదోనిలోని వెంకట చలపతి చేనేత సహకారం సంఘం కాస్తోకూస్తో ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ సొసైటీకి ఆప్కో నుంచి నూలు (యార్న్‌) సరఫరా లేకపోవడం, సరిపడ కూలీలు చెల్లించకపోవడంతో అచేతనావస్థలో ఉంది. చేనేత సహకార సంఘాల్లో పని చేసే కార్మికులకు ఆర్థిక చేయూతను అందించాలనే లక్ష్యంగా 2019లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ‘త్రిఫ్ట్‌ నిధి’ని అమలులోకి తెచ్చింది. సంఘాల్లో పని చేసే కార్మికుడుకు రోజువారి వేతనంలో 8 శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 16 శాతం చేర్చి త్రిఫ్ట్‌ నిధి ఖాతాకు జమ చేస్తుంది. చేనేత సంఘాల్లో పని చేసే కార్మికులకు ఇది ఆర్థికంగా ఉండగా ఉన్నా, సంఘాలు మొత్తం మూత పడడంతో నేతన్నలకు అందని ద్రాక్షగా మారింది. అయితే యాక్టివ్‌గా ఉన్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘానికి ఒక్కటే రూ.18 లక్షలు నిధులు విడుదలయ్యాయి. సహకార సంఘాలతో నిమిత్తం లేకుండా మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి ఈ పథకాన్ని వర్తింపచేయాలని సర్వత్రా డిమాడ్లు వ్యక్తతమవుతున్నాయి.

జిల్లాలో చేనేతల వివరాలు

చేనేత సహకార సంఘాలు : 14

యాక్టివ్‌ సంఘాలు : 1 (ఎమ్మిగనూరు)

సహకార రంగంలో సభ్యులు : 1,039

సహకారేతర రంగంలో సభ్యులు: 2,301

ఏ పట్టణంలో ఎందరు : ఎమ్మిగనూరు-1,430,

కోడుమూరు-770,

ఆదోని-330

ఉచిత విద్యుత్‌కు అర్హులైన కుటుంబాలు

ప్రాంతం కుటుంబాలు

ఎమ్మిగనూరు 1,137

ఆదోని 184

కోడుమూరు 764

నందవరం, 201

నాగులదిన్నె

గూడూరు 28

గోనేగండ్ల 41

పత్తకొండ 12

కర్నూలు సిటీ 13

వెల్దుర్తి 5

కృష్ణగిరి 19

కల్లూరు 11

ఇతర ప్రాంతాల్లో 35

మొత్తం 2,450

Updated Date - Jul 22 , 2025 | 11:21 PM