మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:39 AM
నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్ బీవై రామయ్య తెలిపారు.
రూ.7.42 కోట్లతో అభివృద్ధి పనులకు గ్రీన సిగ్నల్
27 తీర్మానాలకు స్థాయి సంఘం ఆమోదం
మేయర్ బీవై రామయ్య
కర్నూలు న్యూసిటీ, జూన 13(ఆంధ్రజ్యోతి): నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మేయర్ బీవై రామయ్య తెలిపారు. శుక్రవార నగర పాలక కార్యాలయంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ అధ్యక్షతన జరిగిన ఈ సమా వేశం లో కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, సభ్యులు అధికారులు హాజరయ్యారు. మొత్తం 27 తీర్మానాలు రూ.7.42 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గ్రీన సిగ్నల్ ఇచ్చారు. కార్యక్రమంలో సభ్యులు జుబేర్, యూనుస్, విక్రమసింహారెడ్డి, మిద్దె చిట్టెమ్మ, అదనపు కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌వో జునైద్, అకౌంట్స్ ఆఫీసర్ చుండీ ప్రసాద్, ఇనచార్జి ఎస్‌ఈ శేషసాయి పాల్గొన్నారు.
Updated Date - Jun 14 , 2025 | 01:39 AM