ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హజ్‌ యాత్రకు రాష్ట్రం నుంచి 1,630 మంది

ABN, Publish Date - Apr 17 , 2025 | 11:35 PM

హజ్‌ యాత్రకు రాష్ట్రం నుంచి 1,630 మంది యాత్రికులు వెళ్తున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

ఉర్దూ భాష ప్రాముఖ్యత పోస్టర్‌ విడుదల చేస్తున్న మంత్రి ఫరూక్‌

మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): హజ్‌ యాత్రకు రాష్ట్రం నుంచి 1,630 మంది యాత్రికులు వెళ్తున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. గురువారం నంద్యాల నేషనల్‌ పీజీ కళాశాలలో జిల్లా హజ్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో హజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన్‌, బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ హజ్‌ యాత్రికులకు హైదరాబాద్‌, బెంగుళూరు ఎంబార్కేషన్‌ సెంటర్ల నుంచి వివిధ దశల్లో హజ్‌కు వెళ్తారన్నారు.

ఉర్దూ భాషపై పోస్టర్‌ విడుదల : రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉర్దూ భాష ప్రాముఖ్యతపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ ఉర్దూ భాష ఒక ప్రాంతం, ఒక వర్గం, ఒక మతానికి చెందినది కాదని.. మనందరి భాష అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరక్టర్‌ షేక్‌ మహమ్మద్‌, గౌస్‌పీర్‌, రఫీఅహ్మద్‌, హాఫీజ్‌ అంజాద్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:35 PM