ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాకు 14,053.50 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు

ABN, Publish Date - May 16 , 2025 | 12:31 AM

కర్నూలు జిల్లాలో జూన్‌లో మొదలయ్యే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వివిధ పంటలకు అవసరమైన రాయితీ విత్తనాలను 14,053.50 క్వింటాళ్లను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు.

వ్యవసాయశాఖ జేడీ వరలక్ష్మి

కర్నూలు అగ్రికల్చర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో జూన్‌లో మొదలయ్యే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వివిధ పంటలకు అవసరమైన రాయితీ విత్తనాలను 14,053.50 క్వింటాళ్లను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయశాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. వేరుశనగ కే-6 రకం 11,980 క్వింటాళ్లు, టీసీజీఎస్‌ 1694 రకం వేరుశనగ విత్తనాలు 1250 క్వింటాళ్లు, కే-లేపాక్షి రకం విత్తనాలు 570 క్వింటాళ్లు మొత్తం 13,800 క్వింటాళ్లు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామనీ గురువారం జేడీ తెలిపారు. కందులు ఎల్‌ఆర్‌జీ-41 రకం విత్తనాలు 97.50 క్వింటాళ్లు, ఐసీపీఎల్‌ రకం విత్తనాలు 197.50 క్వింటాళ్లు, పీఆర్‌జీ రకం విత్తనాలు 597.50 క్వింటాళ్లను రాయితీపై అందించనున్నట్లు తెలిపారు. పెసలు పి-4 రకం విత్తనాలను 24 క్వింటాళ్లు, మినుములు ఎల్‌జీజీ-410 రకం విత్తనాలు 2 క్వింటాళ్లు, కొర్ర ఎస్‌ఐఏ రకం విత్తనాలు 25 క్వింటాళ్లు, శ్రీలక్ష్మి రకం విత్తనాలు 45 క్వింటాళ్లు మొత్తం 70 క్వింటాళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డయంచ లోకల్‌ 154 క్వింటాళ్లు, పిల్లిపెసర 11 క్వింటాళ్లు రాయితీపై పంపిణీ చేస్తామని చెప్పారు.

Updated Date - May 16 , 2025 | 12:31 AM