BJP MP CM Ramesh: కేటీఆర్‌కు మతిభ్రమించింది
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:49 AM
తెలంగాణ ప్రతిప్రతిపక్షం బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంట్రాక్టులు కొట్టేశానా?
రూ.1660 కోట్ల కాంట్రాక్టు నామినేషన్‌పైఎవరైనా ఇస్తారా?.. గతంలో మీరిచ్చారా?
బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ ధ్వజం
రండి.. చర్చిద్దాం: కేటీఆర్
అనకాపల్లి/హైదరాబాద్ సిటీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రతిప్రతిపక్షం బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సహా ఇతర వేదికలపై తనను ఉద్దేశించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌కు మతిభ్రమించిందని విమర్శలు గుప్పించారు. చట్ట బద్ధంగా, నిబంధనల మేరకు తమ ‘రిత్విక్ సంస్థ’ తెలంగాణలో పనులు దక్కించుకుందని రమేశ్ తెలిపా రు. ముఖ్యంగా రూ.1,660 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో తాను దక్కించుకున్నట్టు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని, కానీ.. ఇది ఎక్కడైనా సాధ్యమేనా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తాను రుణాలు ఇప్పించినందుకే.. నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారన్న కేటీఆర్ వ్యాఖ్యలను రమేశ్ తిప్పికొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై కాంట్రాక్టు పొందానని చెప్పడం అవాస్తమన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు పనులు అప్పగించే సమయంలో ఎటువంటి నిబంధనలు పాటిస్తుందో పదేళ్లు మంత్రిగా చేసిన కేటీఆర్‌కు తెలియదా?. అని సీఎం రమేశ్ ప్రశ్నించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చిన కేటీఆర్ ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని సీఎం రమేశ్ అన్నారు. సీబీఐ, ఈడీ దాడులు తమ వరకు రాకుండా చూడాలని, కవితను బయటకు తీసురావాలని కోరలేదా? అని ప్రశ్నించారు. ఈ పనిచేస్తే బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వ్యాఖ్యానించారన్నారు. ఆ మాటలు మరిచిపోయారా? అని రమేశ్ నిలదీశారు. అన్ని విషయాలపైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
Updated Date - Jul 27 , 2025 | 05:50 AM