ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్త్రీనిధి యాప్‌తో మహిళలకు మేలు

ABN, Publish Date - May 23 , 2025 | 01:36 AM

గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతిని మరింత వేగవంతం చేసేందుకు స్ర్తీనిధి సంస్థ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేసి, యాప్‌ను తీసుకురావడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

స్ర్తీనిధి యాప్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

డిజిటల్‌ విధానంలో రుణాల చెల్లింపుతో సమయం ఆదా, పారదర్శకత

యాప్‌ ప్రారంభం సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

వన్‌టౌన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతిని మరింత వేగవంతం చేసేందుకు స్ర్తీనిధి సంస్థ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేసి, యాప్‌ను తీసుకురావడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం బస్‌స్టేషన్‌లో సెర్ప్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్మంలో స్ర్తీ నిధి యాప్‌ను సెర్ప్‌, స్త్రీనిధి, యూనియన్‌ బ్యాంకు అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. స్ర్తీనిధి యాప్‌ ఉపయోగించి డిజిటల్‌ విధానంలో రుణాల చెల్లింపులతో సమ యం ఆదా అవుతుందని, మరింత పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపా రు. యాప్‌ వాడకంపై రుణాలు తీసుకున్న మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. స్ర్తీనిధి-ఆంధ్రప్రదేశ్‌, డిజిటల్‌ విధానం ద్వారా రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని స్ర్తీనిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరిప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో పేద మహిళలకు రుణాలను మొబైల్‌ టెక్నాలజీ, బయోమెట్రిక్‌ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా 48 గంటల్లోపు అందించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ రుణాల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, భద్రమైన చెల్లింపుల్లో మరింత పురోగతిని సాధించడం కో సం ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌లో యూనియన్‌ బ్యాంకును భాగస్వామిగా చేసుకున్నందుకు ఆనందంగా ఉందని యూనియన్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ భాస్కర్‌రావు తెలిపారు. సెర్ప్‌ సంస్థలో స్ర్తీనిధి అంతర్భాగమని, గ్రామీణ, పట్టణాల్లో ఉన్న పేద మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతోందని సెర్ప్‌ సీఈవో వాకాటి కరుణ అన్నారు. స్ర్తీనిధి, సె ర్ప్‌, బ్యాంకు అధికారులు, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 01:36 AM