ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్ర‘జల’ భాగస్వామ్యంతో.. నీరు-మీరు

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:51 AM

టిని సద్వినియోగం చేసుకోవటంతో పాటు నీటి వృథాను అరికట్టడం, పునర్వినియోగ పద్ధతులను అవలంబించడం, నీటి వనరులను పెంపొందించుకోవటం కోసం ప్రజా భాగస్వామ్యంలో ‘నీరు-మీరు’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనెల 21 శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు.

రేపు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు

గ్రామాల్లో నీటి బడ్జెట్‌పై ప్రత్యేక ప్రణాళిక

నీటి పొదుపు, పునర్వినియోగం, ఇంకుడు గుంతల ప్రోత్సాహం

పంచాయతీ అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నీటిని సద్వినియోగం చేసుకోవటంతో పాటు నీటి వృథాను అరికట్టడం, పునర్వినియోగ పద్ధతులను అవలంబించడం, నీటి వనరులను పెంపొందించుకోవటం కోసం ప్రజా భాగస్వామ్యంలో ‘నీరు-మీరు’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనెల 21 శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్‌ లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారుల నేతృత్వంలో గ్రామగ్రామాన ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో నీటి వనరులకు సంబంధించిన అధ్యయనంతో పాటు నీటి లభ్యత ఎలా ఉందన్న అంశాలను వివరిస్తారు. గ్రామ అవసరాలకు మించి నీటి వనరులను పెంచుకునేలా తగిన ప్రణాళికలు తయారు చేసుకోవడమే ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశం.

కీలకమైన కార్యక్రమాలు

భూగర్భ జలాల నీటిమట్టాన్ని గణనీయంగా మెరుగుపరిచే చర్యలపైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎడాపెడా బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేయటం, పరిమితికి మించి భూమి లోతుకు తవ్వడం వంటి వాటిపై నియంత్రణ విఽధించటంతో పాటు ప్రజల సహకారంతో వాల్టా చట్టాన్ని సమర్థంగా అమలు జరిగేలా కృషి చే స్తారు. ఒకసారి వినియోగించిన నీటిని తిరిగి వినియోగించుకునేందుకు తగిన ప్రక్రియను అభివృద్ధి చేసుకోవడం కూడా ఇందులో ప్రధానమైనదే. అలాగే, గ్రామాల పరిధిలోని వర్షపు నీటి వనరులను శుభ్రం చేయటానికి ప్రత్యేక డ్రైవ్స్‌ నిర్వహించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాల దగ్గర నిర్మించిన నీటినిల్వ వ్యవస్థలను బాగు చేయడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్ల దగ్గర కొత్తగా వర్షపునీటి నిల్వ నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటారు. చేతి పంపులు, పబ్లిక్‌ ట్యాప్‌లు, ప్రైవేట్‌ ట్యాప్‌లు, బోర్‌వెల్స్‌ వంటి వాటి దగ్గర ఇంకుడు గుంతలతో కూడిన ప్లాట్‌ఫాంలు నిర్మించాలనే అంశాన్ని కూడా ఈ కార్యక్రమంలో చేరుస్తున్నారు. ఓవర్‌హెడ్‌ రిజర్వాయర్ల దగ్గర నీటిని సంరక్షించటానికి ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. పైపులైన్‌ లీకేజీలను అరికట్టడం, పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్యాప్‌లు ఆఫ్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవటం చేస్తారు. వ్యక్తిగత, కుటుంబ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ క్షేత్రాల్లో నీటి వాడకాన్ని అవసరం మేరకు వినియోగించడం, నీటివృథాను అరికట్టడం అనే అంశాలపైనా ప్రచారం చేస్తారు.

Updated Date - Jun 20 , 2025 | 12:51 AM