రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వమిది
ABN, Publish Date - Apr 18 , 2025 | 01:03 AM
పునాదిపాడు రైతు సేవా కేంద్రాన్ని గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ధాన్యం కొనుగోలులో దళారుల ప్రయేయం లేకుండా చేశాం: మంత్రి నాదెండ్ల మనోహర్
కంకిపాడు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు కొత్త ఆలోచనా విధానాలతో ముందుకు వెళుతోందని, దళారులతో ప్రమేయం లేకుండా రైతులకు అండగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని పునాదిపాడు రైతు సేవా కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ధాన్యం రాశులను రైతులు, అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. దాళ్వాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే పద్ధతి లేకపోయినా 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలి పారు. రూ.8600 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అనుకున్న దానికంటే వరి దిగుబడి ఎక్కువ కావడంతో గోనె సం చులు తక్కువ అయ్యాయని రైతులు చెబుతున్నారని, అవసరమైన సం చులు సరఫరా చేయాలని డీఈఎ్‌సఎం పద్మాదేవిని ఆదేశించారు. అనంతరం దావులూరులోని బాలాజీ మిల్లులో ధాన్యం దిగుమతిపై ఆరా తీశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. తర్వాత వణుకూరు రైతుసేవా కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి, తహసీల్దార్ భవన్నారాయణ, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, టీడీపీ జిల్లా కార్యదర్శి అన్నే ధనయ్య, తెలుగురైతు జిల్లా కార్యదర్శి మద్దాలి సాయిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, జనసేన జిల్లా ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ పులి కామేశ్వరరావు పాల్గొన్నారు.
24 గంటల్లోనే నగదు జమ చేసిందీ ప్రభుత్వం
మంత్రి నాదెండ్ల వద్ద రైతుల సంతోషం
ఖరీ్‌్‌ఫతో పాటు దాళ్వాలోనూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఖాతాల్లో కూటమి ప్రభుత్వం నగదు జమ చేసిందని రైతులు మంత్రి నాదెండ్ల మనోహర్ వద్ద ఆనందం వ్యక్తం చేశారు. మునుపెన్న డూ లేనివిధంగా రూ.1600 మద్దతు లభించిందని తెలిపారు. హమాలీలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు
Updated Date - Apr 18 , 2025 | 01:03 AM