ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాగునీటి సక్రమ సరఫరా కోసం గ్రామస్థాయి తనిఖీ కమిటీలు

ABN, Publish Date - May 10 , 2025 | 12:51 AM

ప్రతి కుటుంబానికి సురక్షిత తాగు నీరు అందించేందుకు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో గ్రామస్థాయి సంయుక్త తనిఖీ కమిటీలను ఏర్పాటు చేశామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కలెక్టరేట్‌, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబానికి సురక్షిత తాగు నీరు అందించేందుకు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో గ్రామస్థాయి సంయుక్త తనిఖీ కమిటీలను ఏర్పాటు చేశామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ నుంచి పైప్‌లైను చివరి వరకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ చూస్తుందని తెలిపారు. సర్పంచ్‌, ఇద్దరు వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో కూడిన కమిటీ మూడు రోజులు నీటి సరఫరాలో లోపాలను గుర్తించి తాగునీటి సరఫరా తనిఖీ అనే పీఆర్‌ వన్‌ అప్లికేషన్‌ టైల్‌లో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశిం చామని తెలిపారు. ఉప మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, డివిజనల్‌ పంచాయతీ అధికారి విజయవాడ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారులను పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:51 AM