Vamsi Petition: బ్యారక్ మార్చండి.. లేదా ఖైదీలను పంపండి.. వంశీ పిటిషన్
ABN, Publish Date - Feb 28 , 2025 | 04:42 PM
Vamsi Petition: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బ్యారక్‌లో కొంతమంది ఖైదీలను పెట్టాలంటూ పిటిషన్ వేశారు.
విజయవాడ, ఫిబ్రవరి 28: విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో (Vijayawada SC ST Court) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్న విషయం తెలిసిందే. అయితే జైల్లో తనకు ఇప్పుడు ఉన్న బ్యారక్ మార్చాలంటూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ తరపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. ‘‘నన్ను బ్యారక్ నుంచి మార్చండి.. కాని పక్షంలో నా బ్యారక్‌లోకి మరికొంత మంది ఖైదీలను పెట్టండి. నాకు 6 - 4 బ్యారక్ కేటాయించారు.. అందులో మంచం కూడా పట్డడం లేదు. ఇది కచ్చితంగా సోలిటరీ కన్‌ఫైన్‌మెంట్ కిందకి వస్తుంది’’ అని పిటిషన్‌లో వంశీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
కాగా... సత్యవర్ధన్ కిడ్నాప్‌కు సంబంధించి మూడు రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వంశీని విచారించారు. ముందు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో వంశీని కాప్స్ విచారించారు. అయితే పోలీసుల విచారణలో అనేక ప్రశ్నలను మాజీ ఎమ్మెల్యే దాటి వేసినట్లు తెలుస్తోంది. అలాగే తనకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే పదాలను వంశీ ఎక్కువగా వాడినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వాలని మళ్లీ పిటిషన్ వేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు ఏమన్నారంటే..
వంశీ కస్టడీ ముగియగా.. నిన్న ఎస్సీ, ఎస్టీ కోర్టుకు సెలవు కావడంతో మరో కోర్టులో వంశీని హాజరుపర్చారు పోలీసులు. తనకు జైలులో ఇచ్చిన బ్యారక్ ఇబ్బందిగా ఉందని, అందులో ఒకడినే ఉంచడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే రెగ్యులర్ కోర్టులో కాకుండా ఎస్సీ, ఎస్టీ కోర్టులోనే మెమో దాఖలు చేసుకోవాలని న్యాయాధికారి తేల్చిచెప్పడంతో ఈరోజు (శుక్రవారం) విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. బ్యారక్‌లో ఒంటరిగా ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇతరులతో కలిసి ఉండే అవకాశం కల్పించాలని మెమో దాఖలు చేశారు. లేదా తన బ్యారక్ విశాలంగా ఉంచుతూ.. మరో ముగ్గురు నలుగురు ఖైదీలు ఉండేలా అవకాశం కల్పించాలని న్యాయమూర్తిని కోరారు. వంశీ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తరువాత కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
MLC Election: పోటెత్తిన టీచర్లు
AP Budget 2025: అభివృద్ధి పథకాలకు భారీగా కేటాయింపులు..
Read Latest AP news And Telugu News
Updated Date - Feb 28 , 2025 | 05:16 PM