ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అకాల వర్షం..రైతుకు నష్టం

ABN, Publish Date - May 17 , 2025 | 01:21 AM

ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. పసుపు, మొక్కజొన్న, ధాన్యం రాశులపై పట్టాలు కప్పినప్పటికీ అవి గాలులకు లేచిపోయి పంట తడిచిపోయింది. గాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

పెద ఓగిరాలలో ఆరబెట్టిన మొక్కజొన్న కండెలు

ఉయ్యూరు/తోట్లవలూరు, మే 16(ఆంధ్రజ్యోతి): ఉయ్యూరు మండల పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీవర్షానికి పసుపు, మొక్కజొన్న, దాళ్వా రైతులకు భారీ నష్టం కలిగింది. ఉరుములు, మెరుపులు, తీవ్రగాలులతో రెం డుగంటలకు పైగా కురిసిన వర్షానికి పొలాల్లో ఎండబెట్టిన పసుపుకొమ్ములు, మొక్కజొన్న, రాశులపై ఉన్న ధాన్యం తడిసింది. ఉడకపెట్టిన పసుపుకొమ్ములు, కోసి ఎండబెట్టిన మొక్కజొన్న కండెలపై పట్టాలు కప్పినప్పటికీ గాలులకు లేచిపోయి తడిసిపోయాయి. పెదఓగిరాలలో పసుపు, మొక్కజొన్న కల్లాల్లో నీరునిలిచిపోవడంతో తడిసిన వా టిని వేరే చోటికి చేర్చి ఆరబెట్టుకునేందుకు రైతు లు అవస్థలు పడ్డారు. చినఓగిరాలలో ధాన్యం రాశులపై పట్టాలు కప్పినప్పటికీ తడిసిపోయింది.

అకాల వర్షం నిండా ముంచింది

ఐదెకరాల్లో పసుపు పండించి కొమ్ములు కల్లం లో ఎండబెట్టాం. వర్షానికి నీరు నిలిచి తడిసిపోయింది. తడిసిన పసుపుకొమ్ములు బయటకు తెచ్చి రోడ్లపై ఆరబెట్టడానికి ఖర్చు తడిసి మోపెడవుతుంది.

- అంజిరెడ్డి, రైతు, పెద ఓగిరాల

చేతికొచ్చిన పంట తడిసింది

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షం వచ్చింది. ఆరబెట్టిన మొక్కజొన్న తడిసిపోయింది. కండెలు గుట్టగాచేసి పట్టాలుకప్పినా గాలికి లేచిపోయాయి.

-పెనుముత్స నరసింహ, రైతు, పెద ఓగిరాల

తోట్లవల్లూరు మండలంలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం

శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మెరుపులు, ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. గంటన్నరపాటు భారీశబ్ధాలతో ఉరుములు, మెరుపులు రావటం గతం లో తామెప్పుడు చూడలేదని పెద్దలు చెబుతున్నారు. ఈ అకాల భారీ వర్షానికి వల్లూరుపాలెం, పలు లంకగ్రామాల్లో మొక్కజొన్న పంట తడిసింది. కొన్నిచోట్ల మొలకలు వస్తున్నాయని రైతులు తెలిపారు. బొడ్డపాడులో భారీ గాలికి సింగిల్‌ఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ స్తంభాలతో సహా విరిగిపడిపోయింది. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగాయి. పిడుగులు పొలాల్లో పడటం వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Updated Date - May 17 , 2025 | 01:21 AM