ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ద్వీపంలో దొంగలు

ABN, Publish Date - May 23 , 2025 | 12:39 AM

భవానీద్వీపంలో కలప దొంగలు బరితెగించారు. ఇంటిదొంగల సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా ద్వీపంలో పచ్చటి చెట్లను తెగనరికారు. ద్వీపం పునరుద్ధరణ పనులకు పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్న తరుణంలో పచ్చదనాన్ని హరించేసే చర్యలకు తెగించారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతుండగా, ఏపీటీడీసీలో ఇంటిదొంగల పేర్లు బయటపడుతున్నాయి.

భవానీద్వీపంలో నరికేసిన చెట్లు

భవానీద్వీపంలో చెట్ల నరికివేత.. కలప తరలింపు

ఫంటులో ట్రాక్టర్‌ తీసుకొచ్చి మరీ అక్రమాలు

శబ్దం రాని యంత్రాలతో చెట్లను ముక్కలుగా చేసి..

అక్రమార్కులను పట్టుకున్న బీఐటీసీ సిబ్బంది

పోలీసులకు అప్పగింత.. కేసు నమోదు.. విచారణ

ఇంటిదొంగల సహకారంతోనేనా..?

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : భవానీ ద్వీపం వెనుక భాగంలో దట్టంగా అటవీ ప్రాంతం ఉన్నచోటకు ఫంటు మీద ట్రాక్టర్లను తీసుకొచ్చి, పెద్దగా శబ్దం రాని మరకోత యంత్రాలతో చెట్లను నరికేస్తున్నారు. చెట్లను ముక్కలుగా చేసి ట్రాక్టర్‌లో తరలిస్తున్నారు. కొద్దిరోజులుగా ఈ తతంగం నడుస్తోందని సమాచారం. పట్టపగలు అక్రమార్కులు ద్వీపంలోకి చొరబడి చెట్లను నరికి తీసుకెళ్లి పోతుంటే అధికారులు చోద్యం చేస్తున్నారు. ద్వీపంలోని అధికారులు, సిబ్బంది సహకారం లేకుండా అక్రమార్కులు లోపలికి ప్రవేశిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బీఐటీసీ మేనేజర్‌ రవీంద్ర ఆదేశాల మేరకు ద్వీపంలో తరచూ సిబ్బంది రౌండ్స్‌ వేస్తారు. గురువారం కూడా రౌండ్స్‌ వేస్తున్న దశలో దూరం నుంచి శబ్దాలు రావటాన్ని గుర్తించారు. అక్రమార్కులు చెట్లు నరకడాన్ని గమనించి వారిని నిలువరించారు. భిక్షాలు అనే వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం భిక్షాలును భవానీపురం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

యూనిట్‌ మేనేజర్‌కు షోకాజ్‌

ద్వీపంలో చెట్లు నరికిన అక్రమార్కులు కొందరు సొసైటీ భూములన్న కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. అయితే, అది అబద్ధమని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా, భవానీ ఐల్యాండ్‌ యూనిట్‌ మేనేజర్‌ చెబితేనే చెట్లు నరికామని అక్రమార్కులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు విజయవాడ డివిజనల్‌ మేనేజర్‌ (డీవీఎం).. సదరు యూనిట్‌ మేనేజర్‌కు షోకాజు నోటీసు ఇచ్చారు.

చర్యలు తీసుకుంటాం- ఏపీటీడీసీ చైర్మన్‌

ఈ విషయంపై ఏపీటీడీసీ చైర్మన్‌ నూకసాని బాలాజీని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, భ వానీ ద్వీపంలో చెట్ల నరికివేత విషయాన్ని ఏపీటీడీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పానన్నారు. భవానీ ద్వీపంలో చెట్ల నరికివేత అటవీ చట్టానికి విరుద్ధమని, బాధ్యులను, కారుకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు.

Updated Date - May 23 , 2025 | 12:39 AM