ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పీఏసీఎస్‌లలో పారదర్శక సేవలు

ABN, Publish Date - Jun 19 , 2025 | 01:30 AM

కృష్ణాజిల్లా కేంద్ర సహకారబ్యాంకు(కేడీసీసీబీ) పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో(పీఏసీఎ్‌సలు) రైతులకు సత్వర, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని కేడీసీసీబీ చైర్మన్‌ నెట్టెం రఘురాం ఆదేశించారు.

పీఏసీఎస్‌ల సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేడీసీసీబీ చైర్మన్‌ నెట్టెం రఘురాం

ఉమ్మడి జిల్లాలోని 213 పీఏసీఎ్‌సలలో కంప్యూటరీకరణ పూర్తి: కేడీసీసీబీ చైర్మన్‌ నెట్టెం రఘురాం

మచిలీపట్నం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా కేంద్ర సహకారబ్యాంకు (కేడీసీసీబీ) పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో(పీఏసీఎ్‌సలు) రైతులకు సత్వర, పారదర్శకమైన సేవలు అందించాలని సిబ్బందిని కేడీసీసీబీ చైర్మన్‌ నెట్టెం రఘురాం ఆదేశించారు. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణలో భాగంగా సిబ్బందికి శిక్షణ తరగతులను కేడీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని 213 పీఏసీఎ్‌సలలో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇకనుంచి డిజిటల్‌ పద్ధతిలోనే పాలనా వ్యవహారాలు పీఎసీఎ్‌సలలో నడపాల్సి ఉందన్నారు. ప్రస్తుతం మీసేవా కేంద్రాల ద్వారా భూములకు సంబంధించిన వన్‌బీ, అండగల్‌పత్రాలు ఇస్తున్నారని, ఇకనుంచి పీఎసీఎ్‌సల ద్వారా అందించేలా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని, సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు. పీఎసీఎ్‌సల కంప్యూటరీకరణలో కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30శాతం, నాబార్డు 10శాతం ఖర్చును భరిస్తోందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో శ్యామ్‌మనోహర్‌, జీఎం చంద్రశేఖర్‌, ఆప్కాబ్‌ ఏజీ ఎం అశోక్‌, కేడీసీసీబీ అధికారులు జి.పవన్‌కుమార్‌, టి.జగదీ్‌షబాబు, విజయసారథి పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 01:30 AM