ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు భారత శౌర్య తిరంగా యాత్ర

ABN, Publish Date - May 16 , 2025 | 01:13 AM

‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో మనదేశ సైన్య శౌర్యపరాక్రమాలను ఘనంగా చాటేందుకు శుక్రవారం నగరంలో ‘భారత శౌర్య తిరంగా యాత్ర’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొంటున్నాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటారు. ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు జరుగుతుంది.

5 వేల మంది విద్యార్థులతో నిర్వహణ

సాయంత్రం 5 గంటలకు ఐజీఎంసీ స్టేడియం నుంచి..

హాజరుకానున్న సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు

దేశభక్తి పెంపొందేలా కార్యక్రమాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో మనదేశ సైన్య శౌర్యపరాక్రమాలను ఘనంగా చాటేందుకు శుక్రవారం నగరంలో ‘భారత శౌర్య తిరంగా యాత్ర’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొంటున్నాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటారు. ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు జరుగుతుంది.

కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌

5 వేల మందితో ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించాయన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 5 వేల మందితో భారతమాతాకీ జై అంటూ నగరం మార్మోగేలా ర్యాలీ నిర్వహిస్తున్నా మన్నారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజిసర్కిల్‌ వరకు చేరుకుంటుందన్నారు. 500 మీటర్ల జాతీయ పతాకాన్ని విద్యార్థులు పట్టుకుని ర్యాలీ చేస్తారని తెలిపారు. ర్యాలీ విజయవంత మయ్యేలా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - May 16 , 2025 | 01:13 AM