ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘నీట్‌’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN, Publish Date - May 04 , 2025 | 01:06 AM

నీట్‌-2025 పరీక్షను ఆదివారం నిర్వ హించనున్నారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

నేడు విజయవాడలో 28 కేంద్రాల్లో పరీక్ష

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహణ

కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో అధికారులకు ప్రత్యేక శిక్షణ

విజయవాడ, మే 3(ఆంద్రజ్యోతి): నీట్‌-2025 పరీక్షను ఆదివారం నిర్వ హించనున్నారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 13,625 మంది పరీక్ష రాయబోతున్నారు. నీట్‌ పరీక్ష కోసం ప్రభుత్వం నగరం లో 28 కేంద్రాలు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అనుమతులున్న పీడబ్య్లూడీ అభ్యర్థులకు మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు అవకాశమిచ్చారు. పరీక్ష నిర్వహించబోయే అధికారులకు శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఏర్పాట్లు, కంట్రోల్‌ రూమ్‌ విధులు, బయోమెట్రిక్‌ హాజరు, వీడియోగ్రఫీ, సీల్డ్‌ కవర్స్‌ నివేదికలు, కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ నిర్వహణపై కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్ష నిర్వహించాలని శిక్షణకు హాజరైన అధికారులకు కలెక్టర్‌ సూచించారు. శిక్షణ అధికారులు ఆదిశేషుశర్మ, వెంకటేశ్వరరావు, ఆర్డీవో కె.చైతన్య పాల్గొన్నారు.

‘నీట్‌’ను సక్రమంగా నిర్వహించాలి

అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్ష

మచిలీపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లాలో ఆదివారం నీట్‌ పరీక్షను సక్రమంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదే శించారు. తన క్యాంప్‌ కార్యాలయం నుంచి జూమ్‌ మీటింగ్‌ద్వారా నీట్‌పరీక్ష నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను శనివారం ఆయన అధికారులకు వివరించారు. ఆదివారం మద్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మచిలీపట్నంలోని కేంద్రీయ వి ద్యాలయం, కృష్ణా యూనివర్సిటీ, గన్నవరంలోని వీఎస్‌టీ జాన్స్‌ ఎస్‌ఎస్‌లలో పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షల నోడల్‌ అధికారులు, సహా య నోడల్‌ అధికారులు అన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిది పరిశీలించాలన్నారు. జిల్లాలో 1,096మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఉదయం 11గంటల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించి, 1.30 గంటలకు పరీక్షాకేంద్రాల అన్ని గేట్లను మూసివేయాలన్నారు. అధికారులు, సిబ్బంది, ఇన్విజి లేటర్లు ఆదివారం ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల న్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాల న్నారు. విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేశాకే లోనికి అనుమతించాల న్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు, తిరిగి వెళ్లేందుకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ ఆర్‌.గంగాధరరావు, ఏఎస్పీ వీవీ నాయుడు, డీఆర్వో కె. చంద్రశేఖర్‌, ఆర్డీవోలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ సత్యానందం, రవాణాశాఖా జిల్లా అధికారి వాణిశ్రీ, డీఎం అండ్‌ హెచ్‌వో శర్మిష్ట, మచిలీపట్నం, పెడన, గన్నవరం తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 01:06 AM