ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆసుపత్రిలో అష్టకష్టాలు

ABN, Publish Date - Jun 19 , 2025 | 12:53 AM

వైద్యం చేయించుకుందామని పెద్దాసుపత్రికి వస్తే.. అక్కడి పరిస్థితులు చూసి పై ప్రాణాలు పైనే పోయే దుస్థితి ఏర్పడింది. ఆసుపత్రి గేటు నుంచి వెళ్లడం ఓ ఎత్తయితే, ఓపీ తీసుకోవడం, అవసరమైతే అడ్మిట్‌ కావడం మరో ఎత్తు. ఇక నడవలేని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని లోపలకు తీసుకెళ్లాలంటే నరకమే. రోగులకు వినియోగించే సె్ట్రచర్లు, వీల్‌చైర్లు సరిపడా లేకపోవడంతో చాలామంది పాక్కుంటూ, మోసుకుంటూ వెళ్తున్న హృదయ విదారకమైన దృశ్యాలు మన జీజీహెచ్‌లో రోజూ కోకొల్లలు.

కాలుకు ఇన్‌ఫెక్షన్‌ అయిన వ్యక్తిని తీసుకెళ్తున్న సహాయకులు

ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో పేద రోగుల దుస్థితి

సె్ట్రచర్లు, వీల్‌చైర్లు ఉన్నా.. వినియోగంలో సున్నా

చిన్నచిన్న మరమ్మతులకు పక్కన పడేసి..

రోగులకు అందుబాటులో లేకుండా చేసి..

చేసేదేమీ లేక ఎత్తుకెళ్తున్న రోగుల బంధువులు

సింగిల్‌గా వస్తున్నవారు పాక్కుంటూనే..

అధికారుల నిర్లక్ష్యంపై రోగుల సహాయకుల ఆగ్రహం

విజయవాడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : నాలుగు జిల్లాలకు ప్రధానమైన ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో రోగులను తీసుకెళ్లడానికి స్ర్టెచర్లు, వీల్‌చైర్లు లేని దుస్థితి ఏర్పడింది. రోజూ వందలాది మంది రోగులు నడవలేని పరిస్థితిలో వైద్యసేవల కోసం వస్తుండగా, వారిని తీసుకెళ్లే సె్ట్రచర్లు, వీల్‌చైర్లను ఆసుపత్రిలో ఓ మూలనపడేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా పక్కనపడేసిన వాటిలో అనేక సె్ట్రచర్లు పనిచేయడానికి అనువుగానే ఉన్నప్పటికీ ఉపయోగించకుండా వదిలేశారు. ఓవైపు రోగులు నడవలేక ఇబ్బందిపడుతుంటే, మరోవైపు ఆసుపత్రి లోపల, బయట సె్ట్రచర్లు కుప్పలుగా పడేసి ఉండటంపై రోగుల సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు సరైన వైద్యసదుపాయాలు కల్పించాలనే భావనతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

మోసుకెళ్లాల్సిందే..

అనేక ప్రమాదాల్లో గాయపడి నడవలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు, అస్వస్థతకు గురైన ఎమర్జెన్సీ రోగులను కచ్చితంగా సె్ట్రచర్‌, వీల్‌చైర్‌పైనే వార్డుల్లోకి వెళ్లాలి. కానీ, అందుబాటులో ఉన్నవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. దీంతో సహాయకులుగా ఉన్నవారు రోగులను ఎత్తుకెళ్తుండగా, సహాయకులు లేని రోగులు పాక్కుంటూ వెళ్తున్నారు. ఎవరైనా ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా, వీల్‌చైర్లు ఖాళీ లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. దాతలు సేవాస్ఫూర్తితో అందజేసిన సె్ట్రచర్లు, వీల్‌చైర్లను కూడా చిన్నచిన్న సమస్యలకే మూలనపడేస్తున్నారు. మరమ్మతులు చేయించాలనే కనీస శ్రద్ధ లేకపోవడంతో ఆసుపత్రిలో రోజురోజుకూ మూలనపడేసిన సె్ట్రచర్లు ఎక్కువవుతున్నాయి.

ఆడవాళ్లం ఎలా ఎత్తుకెళ్తాం..

మా అత్తకు కొన్నిరోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉందంటే ఎయిమ్స్‌లో వైద్యం చేయిస్తున్నాం. ఎయిమ్స్‌ వైద్యుల సూచన మేరకు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడి వరకు ఆటోలో వచ్చాం. మా అత్తను లోపలకు తీసుకెళ్లడానికి వీల్‌చైర్‌ కావాలని సిబ్బందిని అడిగితే ప్రస్తుతం ఖాళీ లేవని, కొంత సమయం వేచి ఉండాలని చెబుతున్నారు. ఎంత సమయం వేచి ఉన్నా వీల్‌చైర్‌ ఇవ్వలేదు. ఆమె నడిచే పరిస్థితిలో లేదు. ఆవిడను నేను ఎత్తుకుని ఎలా తీసుకెళ్లగలను. వీల్‌చైర్‌ లేని ఈ ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉంటుందోనని భయమేస్తుంది. - కుమారి, భవానీపురం

వీల్‌చైర్‌ లేక పాక్కుంటూ వస్తున్నా..

నా కాలుకు ఇన్‌ఫెక్షన్‌ అయ్యింది. ఇక్కడి వరకు ఆటోలో వచ్చా. కానీ, ఆసుపత్రి లోపలకు వెళ్లాలంటే నడవలేకపోతున్నా. వీల్‌చైర్‌ కావాలని అడిగితే ఎవరూ స్పందించట్లేదు. ఎంత సమయం ఉన్నా ప్రయోజనం లేదని పాక్కుంటూ పోతున్నా. సిబ్బందిని అడుగుతున్నా ఎవరూ స్పందించట్లేదు. - నారాయణరావు, పటమట

Updated Date - Jun 19 , 2025 | 12:53 AM