ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

ABN, Publish Date - May 11 , 2025 | 01:13 AM

కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది.

మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక పిలుపు

గవర్నర్‌పేట, మే 10(ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని మధ్యతరగతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. లేబర్‌ కోడ్‌ల రద్దు కోరుతూ జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వేదిక పిలుపునిచ్చింది. శనివారం వేదిక ఆధ్వర్యాన ఎంజీ రోడ్డులోని బాలోత్సవ్‌ భవన్‌లో మధ్యతరగతి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సదస్సు లో వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఆర్‌.అజయ్‌కుమార్‌ మాట్లాడారు. కార్పొరేట్‌ సంస్థలకు లాభాలు అందించే లక్ష్యంతో కేంద్రం కార్మిక చట్టాలు రద్దు చే సి లేబర్‌ కోడ్‌లు తెచ్చిందన్నారు. అవి అమల్లోకి వస్తే ఇప్పుడున్న అనేక హక్కులను కార్మికులు, ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు కృషి చేశాయని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపివేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘం(ఏఐబీఈఏ) రాష్ట్ర నాయకుడు వై.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. లేబర్‌ కోడ్‌ల వల్ల ఉద్యోగ భద్రత, ఈఎ్‌సఐ, కనీస వేతనాలు, పోరాడే హక్కులను కార్మికులు కోల్పోవాల్సి వస్తుందని సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సంయుక్త కార్యదర్శి జి.కిషోర్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయడంతో పాటు పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని ఆయన డి మాండ్‌ చేశారు. సదస్సులో బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకుడు ఎస్వీ రమణ, బీఎ్‌సఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకుడు ఎల్‌.కృష్ణబాలా జీ, విద్యుత్‌ సంఘం నాయకుడు ఎల్‌.రాజు, బ్యాంకు అధికారుల సం ఘం నాయకుడు కేఏబీఎల్‌ నర్సింహం, బీమా ఉద్యోగుల సంఘం నా యకుడు సీహెచ్‌ కళాధర్‌ ప్రసంగించారు. సమ్మెను జయప్రదం చేయాలని ముద్రించిన వాల్‌పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.

Updated Date - May 11 , 2025 | 01:14 AM