సహజీవనం చేస్తున్న వ్యక్తే పొడిచి చంపాడు
ABN, Publish Date - May 17 , 2025 | 01:26 AM
పట్టణాని కి చెందిన మహిళ మల్లెల దుర్గాస్రవంతిని హత్యచేసి పరారైన అచ్చి నరసింహారావు(పెదబాబును) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనుమానంతోనే ఘాతుకం..
మహిళ హత్యకేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ తిలక్..నిందితుడి అరెస్టు
నందిగామ, మే 16(ఆంధ్రజ్యోతి): పట్టణాని కి చెందిన మహిళ మల్లెల దుర్గాస్రవంతిని ఈనెల 1న హత్యచేసి పరారైన అచ్చి నరసింహారావు (పెదబాబును) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి పలు ప్రాంతాల్లో తలదాచుకున్న పెదబాబు కోర్టులో లొంగిపోయేందుకు నందిగామ వస్తుండగా, గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఏసీపీ ఏబీజీ తిలక్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘మృతురాలు మల్లెల దుర్గాస్రవంతితో నిందితుడు అచ్చి నరసింహారావు కొద్దికాలంగా సహజీవ నం చేస్తున్నాడు. ఆమెపై ఉన్న అనుమానంతో ఈ నెల 1న సాయంత్రం పట్టణంలోని ఎన్‌ఎ్‌సపీ కా లనీ సమీపంలో ఉంటున్న స్రవంతి ఇంటికి వెళ్లా డు. అత్యంత కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం పరారయ్యాడు. పెదబాబుపై నందిగామ స్టే షన్‌లో 8 కేసులు, తిరుపతిలో ఒక కేసు ఉన్నా యి. నిందితుడు పలు కేసుల్లో చిక్కుకున్న సమయంలోనూ స్రవంతి బెయిల్ ఇప్పించింది. పెదబాబుపై రౌడీషీట్ ఉండేది. వైసీపీ హయాంలో షీట్ తీసేశారు. తిరిగి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. పీడీ చట్టం కూడా ప్రయోగిస్తాం. నిందితుడి కోసం నాలు గు టీమ్‌లు ఏర్పాటు చేసి గాలించాం. ఆయన బంధువులు, స్నేహితులను విచారిస్తున్న సమయంలో మా సిబ్బందికి చిక్కాడు.’ అని ఏసీపీ తెలిపారు. అనంతరం నరసింహారావును కోర్టులో హాజరుపరిచారు. సీఐ వైవీవీఎల్ నాయు డు, ఎస్సై అభిమన్యు పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 01:26 AM