రాజధాని గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:00 AM
అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఆర్డీయే పనిచేస్తోందని, రాజధానిలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేలా డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, గ్రామాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఆర్డీయే కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి అభివృద్ధి: సీఆర్డీయే కమిషనర్ కె.కన్నబాబు
విజయవాడ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే లక్ష్యంతో సీఆర్డీయే పనిచేస్తోందని, రాజధానిలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేలా డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని, గ్రామాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఆర్డీయే కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. శనివారం రాజధాని ప్రాంతంలో అభివృ ద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, స్వర్ణాంధ్ర -2047 సంకల్పంలో భాగంగా వెలగపూడిలో పారిశుధ్య కార్మికులు, గ్రామస్తులతో కలిసి నిర్వహించిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఆయన పాల్గొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ఈ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్దతుల్లో రీసైకిల్ చేయడం అనే థీమ్‌ను రాష్ట్ర ప్రభు త్వం ఈ నెలకు ఎంపిక చేసిందన్నారు. అందులో భాగంగా రాజధాని గ్రామాల్లో తడి, పొడిచెత్త సేకరణ, చెత్తను డంప్ చేసే విధానంపై గ్రామస్తులకు వివరించారు. సిటీస్ ప్రాజెక్ట్ కింద అమరావతిలో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామ ని, అందులో భాగంగా నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఈ-హెల్త్ కేంద్రాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యేలా చూసుకోవాలన్నారు. వీటిలో పనిచేసే సిబ్బంది నియామకాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించా రు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను కమిషన ర్ పర్యవేక్షించి, పనులు చేస్తున్న నిర్మాణ సంస్థల ప్రతినిధుల కు పలు సూచనలు చేశారు. మే 2న ప్రధాని పర్యటనకు సం బంధించిన సన్నాహాలను పరిశీలించారు. మండంలోని టిడ్కో గృహ సముదాయాలు, మల్కాపురం, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాలను సందర్శించారు. అమరావతిలో నిర్మాణపనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం రైతులు, అధికారులతో కలిసి రాజధాని అభివృద్ధి పనుల పురోగతి, గ్రామస్తులు వెల్లడించిన పలు సమస్యలపై చర్చించారు. అమరావతి అభివృ ద్ధి, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో అందరూ భాగస్వాముల వ్వాలని కమిషనర్ పిలుపునిచ్చారు. సీఆర్డీయేలోని వివిధ విభాగాల అధికారులు, స్థానిక నాయకులు, రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - Apr 20 , 2025 | 12:00 AM