ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహిమాన్విత క్షేత్రం కొండపర్వ గట్టు!

ABN, Publish Date - May 20 , 2025 | 01:08 AM

ఎన్టీఆర్‌ జిల్లాలోని కొండపర్వ గట్టుపైన శైవక్షేత్రంలో శ్రీ భమరాంభింకా మల్లేశ్వరస్వామి(మల్లయ్యస్వామి) కొలువై ఉన్నారు. కొండపై కొలువై భక్తుల కొంగుబంగారంగా స్వామి విలసిల్లుతున్నాడని, స్వామిని మొక్కుకుంటే తీరని కోర్కెలు తీరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చటి ప్రకృతి అందాలతో ఆహ్లాదకర వాతావరణం పంచే కొండపర్వ గట్టును ఆధ్మాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలున్నాయి. జిల్లా ఆర్థికాభివృద్ధిలో 64 శాతం పర్యాటకం, సేవారంగాల ద్వారా ఆదాయం వస్తున్న నేపథ్యంలో, స్వర్ణాంధ్ర- 2047 కల సాకారం చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం, ఏపీటీడీసీ అధికారులు ఆధ్మాత్మిక, పర్యాటకాభివృద్ధికి అవకాశమున్న ఇటువంటి ప్రాంతాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

కొండపైన మల్లేశ్వరస్వామి ఆలయం

ఆహ్లాదకర వాతావరణంలో ఆధ్యాత్మిక శోభతో అలరారుతుతున్న సుందర ప్రాంతం

కొండపై స్వయంభువుగా వెలసిన మల్లయ్యస్వామి

భక్తుల కొంగుబంగారం..కోర్కెలు తీర్చే స్వామిగా ప్రతీతి

శివరాత్రికి అర లక్షకు పైగా భక్తుల రాక

మౌలిక సదుపాయాలు కల్పించి, కాటేజీలు ఏర్పాటు చేస్తే క్షేత్రానికి మరింత ఆదరణ

ఎన్టీఆర్‌ జిల్లాలో పర్యాటకాభివృద్ధికి దోహదపడే క్షేత్రం

(ఆంధ్రజ్యోతి, విస్సన్నపేట)

ఇదీ ఆలయ నేపథ్యం

70 ఏళ్ల క్రితం నూజివీడు, విస్సన్నపేటకు మధ్యలో ఉన్న కొండపర్వలో కొండగట్టుపై శ్రీ భమరాంభికా మల్లేశ్వరస్వామి (మల్లయ్యస్వామి) స్వయంభువుగా వెలసినట్టు ప్రతీతి. కొండగట్టు సమీపంలోని చిత్తపూర్‌కు చెందిన కొందరు మేక ల కాపరులు మేకలను మేపుతుండగా మల్లయ్యస్వామి దర్శనమిచ్చారని అప్పటి నుంచి పూజలు చేయడం ప్రారంభించారు. ఏడాది పాటు చిత్తపూర్‌ గ్రామస్థులు తిరునాళ్లు నిర్వహించారు. రెండో ఏడాది నుంచి కొండపర్వకు చెందిన గొట్టిపూళ్ల ఉమామహేశ్వర వెంకటరామారావు(పెద్దబాబు), గొట్టిపూళ్ల దుర్గా మల్లేశ్వరవరప్రసాద్‌(చిన్నబాబు) ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి స్వామి కల్యాణం నిర్వహించారు. వారి తర్వాత వారి వారసులు దివంగత మాజీ సర్పంచ్‌ గొట్టిపూళ్ల రామకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో అంగరంగ వైభవంగా తిరునాళ్లు, బుర్రకథలు, హరికథలు, డ్రామాలు నిర్వహించేవారు. గొట్టిపూళ్ల బుచ్చి వెంకట్రామ లక్ష్మీనరసింహారావు(బుచ్చిబాబు) ఆలయ ట్రస్టీగా ఉన్నారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు మట్టా వేణుగోపాలరా వు తన సొంత నిధులు రూ.50 వేలతో భక్తుల సౌకర్యార్థం రహదారిని ఏర్పాటు చేశారు. 2006లో కొండపర్వ అల్లుడు గోవర్థనగిరి వెంటక బుచ్చిబాబు తన సొంత నిధులతో గట్టుపై ఆలయాన్ని పునర్నిర్మించారు. 2017లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి స్వామి కల్యాణం మాత్రమే నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం లేదు. ఇటీవల జరిగిన శివరాత్రికి అర లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనానికి వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి.

ఆహ్లాదం..ఆధ్యాత్మికతల మేళవింపు

కొండ చుట్టుపక్కల మామిడి తోటలు, పొలాలతో ఆహ్లాదకర వాతావరణం, కొండపైన ఆధ్యాత్మిక శోభ మేళవింపుతో కొండపర్వ మల్లయ్యస్వామి మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయానికి వచ్చిన భక్తులకు మానసిక ప్రశాంత కలుగుతుంది. గట్టుపై నుంచి చూస్తే విహంగ వీక్షణ చేసినట్లు ఉంటుంది. చుట్టుపక్కల పల్లెలు ఉండటంతో గ్రామాల్లో తిరునాళ్ల మూడు రోజులు ఆధ్యాత్మిక శోభ సం తరించుకుంటుంది. ఆలయం వెలసిన కొత్తలో ఒక స్వామి ఉండే వారని నిత్యం స్వామికి పూజలు చేసేవాడని ఆయన ఉన్నట్టుండి మాయమైపోయాడని భక్తులు చెబుతుంటారు. వృద్ధులు కూడా కొండెక్కి మొక్కులు చెల్లించుకుంటుంటారు.

Updated Date - May 20 , 2025 | 01:08 AM