ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరువూరులో మారుతున్న రాజకీయ సమీకరణాలు

ABN, Publish Date - May 18 , 2025 | 01:27 AM

చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి తన పదవికి రాజీనామా చేయడంతో ఈనెల 19న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగనుంది.

శుక్రవారం రాత్రి క్యాంప్‌నకు మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు

(ఆంధ్రజ్యోతి-తిరువూరు): చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి తన పదవికి రాజీనామా చేయడంతో ఈనెల 19న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరగనుంది. దీంతో పట్టణంలో రాజకీయ సమీకరణా లు మారుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందోనని రాజకీయ ఉత్కంఠ పట్టణ ప్రజల్లో ఉంది. ఎవరు చైర్‌పర్సన్‌గా ఎంపికవుతారోనని పట్టణవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ సమీకరణాల్లో మార్పుల కారణంగా వైసీపీ నాయకత్వం ఇప్పటికే కొందరు కౌన్సిలర్లను పట్టణం దాటించింది. శుక్రవారం రాత్రి మరి కొందరు కౌన్సిలర్లను క్యాంప్‌నకు తరలించింది. బోర్డులో మొత్తం 17 మంది వైసీపీ సభ్యులున్నా ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆపార్టీ బలం తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ అధిష్టానంలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచా రం ఆ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పు డు మునిసిపల్‌ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ, ఇతర పార్టీల నుంచి కొందరు కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు నామినేషన్లు వేస్తే అప్పట్లో వైసీపీ నాయకులు, అభ్యర్థుల్ని బెదిరించి పోటీనుంచి విరమింపజేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, వైసీపీ కౌన్సిలర్లు అధికార పార్టీవైపు చూడటం తప్పులేదని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - May 18 , 2025 | 01:27 AM