ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఏపీటీడీసీలోని కీలక ఉద్యోగి రాసలీలలు..

ABN, Publish Date - May 04 , 2025 | 12:53 AM

ఆ సార్‌ ఆఫీసులో చాలా సి్ట్రక్ట్‌. ఆఫీసు పూర్తయ్యాక మాత్రం చాలా సిల్లీ. సరసాలు ఆడటంలో ఆయనకు సాటే లేరు. ఏకంగా పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డివిజనల్‌ కార్యాలయంలోనే దుకాణం తెరిచిన ఘనుడు. రోజూ ఆఫీసు మూసివేసిన తర్వాత ఓ మహిళను వెంటబెట్టుకుని వచ్చి కార్యాలయ తాళాలు తెరిచి ఏకాంత వ్యవహారాలు వెలగబె డుతున్నాడు. సార్‌ కార్యకలాపాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడం, వారు విచారణకు ఆదేశించడం, సీసీ ఫుటేజీలో అడ్డంగా దొరికిపోవడంతో ఏపీటీడీసీలోని ఈ కీలక ఉద్యోగి బాగోతం బట్టబయలైంది.

APTDC

ఏపీటీడీసీలోని కీలక ఉద్యోగి రాసలీలలు

డివిజనల్‌ కార్యాలయంలోనే కార్యకలాపాలు

ఆఫీసు మూసివేశాక ఓ మహిళతో ప్రవేశం

తాళాలు తెరిచి ఏకాంత వ్యవహారాలు

సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి..

సీసీ ఫుటేజీ ద్వారా బండారం బట్టబయలు

8 విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆయన. రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను వెంటబెట్టుకుని కార్యాలయానికి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కలెక్టరేట్‌కు అభిముఖంగా, బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌ ఉంది. ఈ కాంప్లెక్స్‌ దిగువన ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్‌ కార్యాలయం, కమర్షియల్‌ విభాగాలు ఉన్నాయి. ఈ భవనం మల్టీప్లెక్స్‌ కావటంతో బయట పెద్దపెద్ద గేట్లు ఉంటాయి. సెక్యూరిటీ కూడా ఉంటుంది.


పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. దీంతో ఆయన రోజూ రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో ఓ మహిళను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వస్తుండటంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో సందరు ఉద్యోగి అడ్డంగా దొరికిపోయారు. రోజూ రాత్రి 7-8 గంటల మధ్యలో తన బైకుపై ఓ మహిళను తీసుకురావటం సీసీ కెమెరాల ద్వారా రికార్డైంది. బైక్‌ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు వచ్చి బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు.


గతంలోనూ ఇంతే.. అయినా చర్యలు శూన్యం..

ఈ ఉద్యోగి కామక్రీడలు ఇంతకుముందు కూడా జరిగాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్‌ రూమ్‌లో కూడా చాలాకాలం ఈయన కార్యకలాపాలు సాగించారు. పార్క్‌లో వాకింగ్‌ చేయటానికి వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడు. దీంతో సిబ్బందే వలపన్ని సదరు సార్‌.. లీలలను బయట పెట్టారు. ఏసీ పైపుల రంధ్రానికి సీక్రెట్‌ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఏకంగా డివిజనల్‌ కార్యాలయంలోనే ఇలాంటి పనులు చేస్తుండటంతో అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటో ఆయన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకోవడంతో ఆయన రాసలీలలను ఆయనే బయట పెట్టుకున్నట్టు అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోంది.

Updated Date - May 04 , 2025 | 08:05 AM