మహానాడుకు తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు
ABN, Publish Date - May 27 , 2025 | 12:45 AM
కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల నుంచి నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం తరలివెళ్లారు.
మచిలీపట్నం టౌన్/ అవనిగడ్డ, మే 26(ఆంధ్రజ్యోతి): కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల నుంచి నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం తరలివెళ్లారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు మేరకు టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి బచ్చుల అనీల్‌కుమార్, బందరు రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, కార్యదర్శి కాటం మధు, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, మార్కెట్‌యార్డు చైర్మన్ కుంచేనాని తదితరులు నాలుగు బస్సులు, 25 కార్లలో బయలుదేరి వెళ్లారు.
అవనిగడ్డ నుంచి 50 కార్లలో..
కడపలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి అవనిగడ్డ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివెళ్లేందుకు పార్టీ నియోజకవర్గ నేత, పారిశ్రామిక వేత్త బొబ్బా గోవర్ధన్ ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చారు. దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. అవనిగడ్డ నుంచి పది కార్లలో, నియోజకవర్గం నుంచి 50కిపైగా కార్లలో కార్యకర్తలు తరలివెళ్లారు. మహానాడు చివరి రోజైన 29వ తేదీన బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లే వారి కోసం ఆరు మండలాల నుంచి బొబ్బా గోవర్ధన్ సహ కారంతో టూరిస్ట్ బస్సులు ఏర్పాటు చేశామని, కార్యకర్తలు మండల పార్టీ కార్యాలయం, మండల ప్రధాన కేంద్రంలోని సీనియర్ నేతల వద్ద, నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని కొల్లూరి వెంకటేశ్వరరావు సూచించారు. టీడీపీ నేతలు కర్రా సుధాకర్, లకనం నాగాంజనేయులు, చిట్టా అన్నపూర్ణయ్య, మేడికొండ విజయ్, కొల్లూరి ఇమ్మానియేలు, కోట సాయి, తూమాటి ప్రసాద్, బొప్పరాజు సందీప్, విజయ్ పాల్గొన్నారు.
Updated Date - May 27 , 2025 | 12:45 AM