ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మినీ మహానాడుకు పోటెత్తిన టీడీపీ శ్రేణులు

ABN, Publish Date - May 19 , 2025 | 12:26 AM

ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోరంకి ఎల్‌ఎన్‌ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన మినీ మహానాడుకు వేలాదిగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

పెనమలూరు, మే 18(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆధ్వర్యంలో పోరంకి ఎల్‌ఎన్‌ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన మినీ మహానాడుకు వేలాదిగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, పార్టీ పరిశీలకుడు జువ్వాది రామకృష్ణ, తెలుగుమహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర, టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ టీడీపీకి ఉన్న కేడర్‌ ఏ పార్టీకీ లేదన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. టీడీపీ సీనియర్‌ నాయకులు షేక్‌ బుజ్జి, కొండా ప్రవీ ణ్‌, పీతా గోపీచంద్‌లు మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మారుపూడి ధనకోటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ అన్నే ధనయ్య, కోయ ఆనంద్‌ప్రసాద్‌, సంగెపు రంగారావు, తుమ్మలపల్లి హరికృష్ణ, శొంఠి శివరాంప్రసాద్‌, దాసరి హరినీడు, మేడసాని రత్నకుమారి, సూదిమళ్ల రవీంద్ర, వెనిగళ్ల కుటుంబరావు, జంపాన గుర్నాథం, దోనేపూడి రవికిరణ్‌, వల్లభనేని నాని, నెరుసు రాజ్యలక్ష్మి, కూనపరెడ్డి వాసు, వడ్లమూడి శుభశేఖర్‌, గొల్లి వసంత్‌ తదితరులు ఉన్నారు.

టీడీపీ ‘తాడిగడప’ అధ్యక్షుడిగా అనుమోలు ప్రభాకరరావు

టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడిగా అనుమోలు ప్రభాకరరావు తిరిగి ఎంపికయ్యారు. పార్టీ విధేయుడిగా పేరున్న అనుమోలును అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా మినీ మహానాడు వేదికగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఎంపిక చేశారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అనుమోలు తెలిపారు.

Updated Date - May 19 , 2025 | 12:26 AM