ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నెలాఖరులోపు టీడీపీ ‘అవనిగడ్డ’ ఇన్‌చార్జి నియామకం

ABN, Publish Date - May 08 , 2025 | 01:02 AM

టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం కోడూరు రోడ్డులోని కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది.

టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌

అవనిగడ్డ, మే 7(ఆంధ్రజ్యోతి): ‘తమ బాధ చెప్పుకొనేందుకు ఎవరూ లేరని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లా. ఈ నెలాఖరులోపు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమిస్తుంది. టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తా.’ అని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు. బుధవారం టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం కోడూరు రోడ్డులోని కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. తనకు నియోజకవర్గ సమస్యలు తెలుసని, పరిష్కారానికి కృషి చేస్తానని కొనకళ్ల హామీ ఇచ్చారు. ఆరు మండలాల్లో కేఎ్‌సఎ్‌సల నియామకం, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ త్వరలో ముగించేలా పార్టీ మండలాధ్యక్షులు బాధ్యత తీసుకోవాలని నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు సూచించారు. పార్టీ సీనియర్‌ నేత బొబ్బా గోవర్ధన్‌, తెలుగు మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, తుమ్మల చౌదరిబాబు, బండే శ్రీనివాసరావు, మెండు లక్ష్మణరావు, మోర్ల రాంబాబు, నడకుదుటి జనార్దనరావు, బండే కనకదుర్గ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 01:02 AM