ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూసేకరణ ప్రక్రియ వేగవంతం

ABN, Publish Date - May 10 , 2025 | 12:57 AM

రాజధాని అమరావతి రైల్వే లైను నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రైల్వే లైను కోసం ఎనిమిది మండలాల్లోని 22 గ్రామాల్లో అధికారులు భూమిని సేకరిస్తున్నారు. రైల్వే ట్రాక్‌ వెళ్లే మార్గంలో ఖమ్మం, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలోని 12 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో భూముల సర్వే పూర్తయింది. 12 గ్రామాల పరిధిలో ట్రాక్‌ నిర్మాణానికి కావాల్సిన భూమిని అధికారులు గుర్తించి, లెక్కించి పెగ్‌ మార్కింగ్‌ కూడా వేశారు. రైతుల నుంచి చెప్పుకోదగిన అభ్యంతరాలు లేకపోవడంతో గ్రామాల వారీగా భూసేకరణకు కొద్ది రోజుల్లో తుది నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని రెవెన్యూ అధికారి ఒకరు పేర్కొన్నారు. భూములు కోల్పోతు న్న రైతులకు త్వరలో రైల్వే శాఖ పరిహారం చెల్లిస్తుందని తెలిపారు.

వీరులపాడు మండలం చెన్నారావుపాలెంలో పెగ్‌ మార్కింగ్‌ చేస్తున్న రెవెన్యూ, రైల్వే అధికారులు

అమరావతి రైల్వే లైను నిర్మాణానికి ఖమ్మం, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భూముల సర్వే, పెగ్‌ మార్కింగ్‌ పూర్తి

భూములిచ్చేందుకు దాదాపు రైతులందరూ అంగీకారం

తుది నోటిఫికేషన్‌ విడుదలకు అధికారుల కసరత్తు

(కంచికచర్ల - ఆంధ్రజ్యోతి)

సీఎం చంద్రబాబునాయుడు చొరవ వల్ల నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే లైను మంజూరు చేసిన సంగతి విదితమే. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి రాజధాని మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వరకు కొత్త లైను ఏర్పాటు చేయనున్నారు. కొత్త రైల్వేలైను మొత్తం 56.53 కిలోమీటర్లు ఉండగా, ట్రాక్‌, రైల్వే స్టేషన్ల నిర్మాణం కోసం 892 ఎకరాల భూమి అవసరం. గుంటూరు జిల్లాలో 199.20 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, ఎన్టీఆర్‌ జిల్లాలో 334.62 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 24.24 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 98.20 ఎకరాలు, ఈనాం భూములు 52.01 ఎకరాలు, ప్రైవేట్‌ భూములు 741.80 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు లెక్కించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో 297 ఎకరాలకు సంబంధించి భూసేకరణ విషయంలో రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. భూములిచ్చేందుకు దాదాపుగా రైతులందరూ అంగీకరించారు. తమకు పరిహారంతో పాటుగా ఉపాధి కూడా చూపాలని 30 మంది రైతులు మాత్రం అధికారులకు విన్నవించారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పల్నాడు, గుంటూరు జిల్లాలో ఆలస్యం

పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. అక్కడి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. రైతుల అభ్యంతరం వల్ల సేకరణ విషయంలో అధికారులు ముందడుగు వేయటానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలోమీటర్ల ట్రాక్‌

మొత్తం 56.53 కిలోమీటర్ల రైల్వే లైనుకు సంబంధించి మొదటి దశలో ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. నదిపై 3.2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించనున్నారు. మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు చెబుతుండగా, సీఎం చంద్రబాబునాయుడు మాత్రం రెండేళ్లలో పూర్తి చేయాలని గట్టిగా పట్టుపడుతున్నారు. ట్రాక్‌ నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తవుతాయని, కృష్ణానదిపై వం తెన నిర్మాణానికి మూడేళ్లు పడుతుందని రైల్వే అధికారులు అంటున్నారు. మొ త్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,047 కోట్లు. ఆ మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తోం ది. మొదటి దశలో 27 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణానికి రూ.450 కోట్లు, 3.2 కిలోమీటర్ల వంతెనకు రూ.350 కోట్లు ఖర్చు అవుతాయని ప్రాథమిక అంచనా. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) విధానంలో టెండర్లు పిలిచేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రైల్వే లైను వెళ్లే గ్రామాలు

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఎర్రుపాలెం, కేసీరెడ్డిపల్లి

ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలంలో గూడెం మాధవరం, పెద్దాపురం, అల్లూరు, చెన్నారావుపాలెం, జుజ్జూరు, నరసింహారావుపాలెం

కంచికచర్ల మండలంలో గొట్టుముక్కల, పరిటాల

ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు, దాములూరు

పల్నాడుజిల్లా అమరావతి మండలంలో వైకుంఠపురం, యండ్రాయి, కర్లపూడి

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వడ్లమాను, మోతడక

తాడికొండ మండలంలో పెదపరిమి, తాడికొండ, కంతేరు

పెదకాకాని మండలంలో పెదకాకాని, కొప్పురావూరు

Updated Date - May 10 , 2025 | 12:59 AM