ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దుర్గామల్లేశ్వరులకు విశేష పూజలు

ABN, Publish Date - Apr 19 , 2025 | 01:01 AM

ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువై ఉన్న దుర్గామల్లేశ్వరులకు శుక్రవారం విశేష పూజలు జరిగాయి.

కుంకుమార్చనలో పాల్గొన్న దంపతులు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువై ఉన్న దుర్గామల్లేశ్వరులకు శుక్రవారం విశేష పూజలు జరిగాయి. కనకదుర్గమ్మకు ప్రీతిపాత్రమైన శుక్రవారంభక్తులు వివిధ ఆర్జిత సేవల్లో విశేషంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవావరణార్చన, శాంతి కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండ దిగువన ఏర్పాటు చేసిన ఉచిత బస్‌ సదుపాయం ఉపయోగించుకుని భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.

భక్తుల రద్దీ..

కనకదుర్గమ్మ దర్శనానికి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లిం చుకున్నారు. కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేసి కొండపైన క్యూలైన్‌లో అమ్మవారిని దర్శించుకు న్నారు. క్యూలైన్లలో పరిస్థితిని, భక్తుల రాక పోక లను అధికారులు సందర్శించి తగు సూచనలు చేసి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించారు. వేసవి కాలం కావటంతో ఎండ వేడిమికి ఇబ్బంది కల గకుండా భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు.

విరాళాలు అందజేత..

దుర్గామల్లేశ్వర దేవస్థానంలో అన్నదాన పథ కానికి విజయవాడకు చెందిన సి.హెచ్‌.ఎం. మీ నాక్షి తమ కుటుంబ సభ్యులతో కలిసి లక్ష రూపాయలు, కె.కృష్ణమూర్తి రూ.1,11,111 అధికా రులకు చెక్కు అందజేశారు. అనంతరం దాత లకు అమ్మవారి దర్శనం అనంతరం వేదపండి తులతో ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటంతోపాటు ప్రసాదాలు

నృత్య కళార్చన

దుర్గామల్లేశ్వర దేవస్థానం కళావేదిక మీద శుక్రవారం విజయవాడకు చెందిన శ్రీవాగ్దేవి కూచిపూడి నృత్యాలయ విద్యార్థులు అమ్మవారికి నృత్య కళార్చన నిర్వహించారు. గురువు ఎం.గేయ అక్షిత ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది. అనంతరం దేవస్థానం అధికారులు కళాకారులను అభినందించి, అమ్మవారి ప్రసాదం, సర్టిఫికెట్లను అందజేశారు.

Updated Date - Apr 19 , 2025 | 01:01 AM