ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్కేటింగ్‌ క్రీడాకారుల శాంతి ర్యాలీ

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:27 AM

కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని కృష్ణాజిల్లా రోలర్‌స్కేటింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జె.దుర్గాప్రసాద్‌ అన్నారు.

బీఆర్టీఎస్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తున్న స్కేటింగ్‌ క్రీడాకారులు

సత్యనారాయణపురం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని కృష్ణాజిల్లా రోలర్‌స్కేటింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జె.దుర్గాప్రసాద్‌ అన్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఆదివారం బీఆర్టీఎస్‌ రోడ్డులో జిల్లా స్కేటింగ్‌ క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వాళ్లు స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నించాలని, పక్క దేశంలో అల్లర్లు సృష్టించాలనుకోవడం సరికాదని దుర్గాప్రసాద్‌ అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రోలర్‌స్కేటింగ్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు బచ్చు మురళి మాట్లాడుతూ పర్యాటకులపై పాకిస్తాన్‌ ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్య అన్నారు. అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కోశాధికారి సోమ్‌, కోచ్‌లు వరుణ్‌, దిలీప్‌, నాగసేన్‌, గ్రీష్మిత, మహేష్‌, నాని, కీర్తి, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:27 AM