స్కూటీ డిక్కీలో రూ.లక్షన్నర చోరీ..
ABN, Publish Date - May 04 , 2025 | 01:05 AM
హోటల్‌లో టిఫిన్ చేసి వచ్చేలో గా స్కూటీ డిక్కీలో ఉంచిన సొమ్మును దొంగలు చోరీ చేశారు.
ఉయ్యూరు, మే 3(ఆంధ్రజ్యోతి): హోటల్‌లో టిఫిన్ చేసి వచ్చేలో గా స్కూటీ డిక్కీలో ఉంచిన సొమ్మును దొంగలు చోరీ చేశారు. ఈ ఘ టన శనివారం ఉయ్యూరు కూరగాయల మార్కెట్ రోడ్డులో జరిగింది. పట్టణ ఎస్సై విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాకానినగర్ కు చెందిన ఎం.మణికంఠబ్యాంకులో గోల్డ్‌లోన్ తీర్చేందుకు రూ.లక్షన్నర స్కూటీ డిక్కీలో ఉంచి మార్కెట్ రోడ్డులోఉన్న హోటల్ ముందు స్కూటీ నిలిపి టిఫిన్ చేసి వచ్చాడు. అక్కడి నుంచి బ్యాంకు వద్దకు వెళ్లి డిక్కీ తెరిచి చూస్తే అందులో డబ్బు కనిపించలేదు. తిరిగి హోటల్ వద్దకు ఆరా తీశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆప్రాంతంలోని సీసీ కె మెరా ఫుటేజీని పరిశీలించారు. బైకుపై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒక రు స్కూటీ డిక్కీ తెరిచి డబ్బు తీసినట్టు గుర్తించారు. కేసు నమోదు చే సి నిందితుల కోసం గాలిస్తున్నారు.
Updated Date - May 04 , 2025 | 01:05 AM