సరదాలో విషాదం
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:53 AM
మోపిదేవి వార్పు వద్ద, టోల్‌ప్లాజా సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాస బాలభాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మోపిదేవిలో రోడ్డు ప్రమాదం
ఇద్దరు స్నేహితులు దుర్మరణం
మోపిదేవి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : మోపిదేవి వార్పు వద్ద, టోల్‌ప్లాజా సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాస బాలభాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. అవనిగడ్డకు చెందిన బాలభాస్కర్, సుధాకర్, గౌతమ్, యువతేజ స్నేహితులు. సరదాగా చల్లపల్లి వరకు వెళ్లి, బిర్యానీ తినొద్దామని గురువారం సాయంత్రం బయల్దేరారు. బిర్యానీ తిని ఇంటికి తిరిగి వస్తుండగా, మోపిదేవి వార్పు వద్ద ఉన్న టోల్‌ప్లాజా దాటాక ఎదురుగా ఓ కంటైనర్ వచ్చి వీరిని ఢీకొట్టింది. ముందు ఉన్న లారీని ఓవర్ టేక్ చేస్తూ వచ్చి వీరి బైకులను ఢీకొంది. ఒక ద్విచక్ర వాహనంపై ఉన్న భాస్కర్, సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో క్షతగాత్రులను అంబులెన్స్‌లో అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Apr 26 , 2025 | 12:53 AM