ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ గ్రాంటు ప్రకటించాలి

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:24 AM

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అప్పు స్ధానంలో గ్రాంటు ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చే శారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అప్పు స్ధానంలో గ్రాంటు ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చే శారు. మే 2న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి వస్తున్న నేపథ్యంలో మోదీకి సీపీఎం బహిరంగ లేఖ రాసిందని ఆయన తెలిపా రు. ఆదివారం ఎంజీ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్డాడారు. పదేళ్లుగా రాజధాని నిర్మాణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్రాన్ని మోసం చేసిందన్నారు. ఇస్తానన్న గ్రాంటు ఇవ్వలేదని, రాజధాని బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కేవలం రూ.1500 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. 2015లో రాజధానికి శంకుస్థాపనకు వచ్చిన మోదీ నీళ్లు, మట్టి ఇచ్చారని, ఈసారి ఏం ఇస్తారోనని ప్రజల్లో సందేహం ఉందన్నారు. రాజధానిలో రైతులు, కూలీలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేం ద్రంపై ఉందన్నారు.

డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు సరికాదు

సీపీఎంపైన, పార్టీ కార్యదర్శిపైన డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సరికావని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని బాబూరావు అన్నారు. ఉండి నియోజకవర్గంలో 900 ఇళ్లు కూల్చివేయడంతో పేదలు రోడ్డున పడ్డారని, దానిపై ఆందోళన చేస్తు న్న పేదలకు అండగా సీపీఎం నిలిచిందన్నారు. డిప్యూటీ స్పీకర్‌ స్థానంలో ఉండి విచక్షణ కోల్పోయి మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై టీడీపీ అధినాయకత్వం స్పందించాలని, పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 28 , 2025 | 12:24 AM