సాల్ట్ ఫ్యాక్టరీకి అనుమతివ్వాలి
ABN, Publish Date - May 09 , 2025 | 12:45 AM
సా ల్ట్ ఫ్యాక్టరీ లీజుకు అనుమతులిచ్చి, ఫ్యాక్టరీ నిర్వహించేలా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు
మచిలీపట్నం టౌన్, మే 8(ఆంధ్రజ్యోతి): ‘పల్లెతుమ్మలపాలెంలో పాతికేళ్ల నుంచి నడుస్తున్న భారత్ సాల్ట్ ఫ్యాక్టరీని గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. సా ల్ట్ ఫ్యాక్టరీ లీజుకు అనుమతులిచ్చి, ఫ్యాక్టరీ నిర్వహించేలా చూడాలి.’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు డిమాండ్ చేశారు. గురువారం మచిలీపట్నంలో ఆ యన మాట్లాడారు. ఫ్యాక్టరీ మూతపడడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రెండువే ల కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సాల్ట్ ఫ్యాక్టరీ భూముల లీజు సంగతి తేల్చకపోవడంతో వారి ఉపాధి అగమ్యగోచరంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం సాల్ట్ ఫ్యాక్టరీకి అనుమతిచ్చి ఈ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాల్ని కాపాడాలన్నారు. సీపీఎం మచిలీపట్నం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Updated Date - May 09 , 2025 | 12:45 AM