ఎన్‌ఎస్‌ఎం రోడ్డు విస్తరణ పనులకు ప్రణాళికలు చేపట్టండి
ABN, Publish Date - Mar 13 , 2025 | 12:31 AM
ఎన్‌ఎస్‌ఎం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రణాళి కలు చేపట్టాలని నగర కమిషనర్ ధాన్యచంద్ర అధికారులకు సూచిం చారు.
ఎన్‌ఎస్‌ఎం రోడ్డు
విస్తరణ పనులకు ప్రణాళికలు చేపట్టండి
కమిషనర్ ధాన్యచంద్ర సూచన
పటమట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఎన్‌ఎస్‌ఎం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రణాళి కలు చేపట్టాలని నగర కమిషనర్ ధాన్యచంద్ర అధికారులకు సూచిం చారు. 13వ డివిజన్‌లో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. బుధవారం తన పర్యటనలో భాగంగా కమిషనర్ కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్‌తో కలిసి డివిజన్‌లోని న్యూఆర్టీసీ కాలనీ, ఎలక్ర్టీసిటీ కాలనీ, తోటవారి వీధి, కోనేరు వారి వీధి, జేడీ నగర్ తదితర ప్రాంతాల్లోని సమస్య లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామాయ ణపు వారి వీధి, తోటవారి వీధి, కృష్ణా నగర్‌లో అండర్ గ్రౌండ్ పైపులైన్‌లు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్త పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రామలింగేశ్వరనగర్ నుంచి కృష్ణా జలాలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మదర్‌థెరెసా పార్క్‌లో వసతులు మెరుగు పర్చాలన్నారు. పారిశుధ్య పనులు మెరుగుదల చేయాలన్నారు. ఈ పర్యటనలో రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, జోనల్ కమిషనర్ కె.షమ్మీ, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్‌ఆఫీసర్ డాక్టర్ సురేష్‌బాబు, ఈఈ సామ్రాజ్యం, గోపినాయక్, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Mar 13 , 2025 | 12:31 AM